Diwali – Lucky Zodiac signs: దీపావళి పండుగ హిందూ సంప్రదాయంలో ఆనందం, వెలుగులు, ఆశీర్వాదాల ప్రతీకగా పండితులు వివరిస్తారు. ఈ ఏడాది దీపావళి వేడుకలు అక్టోబర్ 18న ధనత్రయోదశితో ప్రారంభమై, అక్టోబర్ 23న భాయ్ దూజ్‌తో ముగుస్తాయని తెలిసిన విషయమే. ఈ ఆరు రోజుల పండుగలో ప్రజలు ఇళ్లను దీపాలతో అలంకరించి, పూజలు నిర్వహించి, సంతోషాన్ని పంచుకుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కాలంలో కొంతమంది రాశులపై లక్ష్మీ నారాయణ అనుగ్రహం కూడాఉండబోతుందని పండితులు వివరిస్తున్నారు.
2025 దీపావళి తులా, కుంభ, వృషభ, మిథున రాశుల వారికి విశేషంగా శుభప్రదంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో లక్ష్మీ దేవి కృపతో ఆర్థికంగా, వ్యక్తిగతంగా వృత్తి పరంగా పురోగతి సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
తులా రాశి:
తులా రాశి వారికి ఈ దీపావళి కాలం ప్రత్యేకమైన మార్పులు తెస్తుంది. గురు గ్రహం ధనస్సు రాశిలో సంచారం చేయడం వల్ల వారి కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి. పనిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అనుకోని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.
ధనస్సు రాశి:
ధనస్సు రాశిలో గురు ప్రభావం బలపడటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. చాలామంది కొత్త ఆస్తి కొనుగోలు లేదా పెట్టుబడులపై దృష్టి పెట్టవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతత నెలకొంటుంది. దీపావళి రోజుల్లో గురు అనుకూల స్థితి వలన కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అలాగే, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు ఉండొచ్చు.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ దీపావళి శుభవార్తలను తెస్తుంది. ఈ సమయంలో షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల్లో లాభదాయక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జ్యోతిష్య ప్రకారం, శని ప్రభావం సానుకూల దిశగా కదులుతుండటంతో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. వ్యాపారం చేసే వారు కొత్త ఒప్పందాలు సాధించవచ్చు. కొత్త పరిచయాల ద్వారా మంచి అవకాశాలు దొరకవచ్చు. ఈ పండుగ సమయంలో కుటుంబంతో గడిపే సమయం కూడా శాంతి, ఆనందాన్ని అందిస్తుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి దీపావళి కాలం ధనప్రాప్తికి దారి తీస్తుంది. శుక్ర గ్రహం అనుకూలంగా ఉండటంతో అదృష్టం వెంటాడుతుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి. వృత్తి రంగంలో ఉన్నవారు కొత్త అవకాశాలు పొందవచ్చు. ఈ సమయంలో చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా మహిళలకు ఈ కాలం ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది.
మిథున రాశి:
మిథున రాశి వారికి దీపావళి సీజన్ సుఖసంతోషాలతో నిండినది. ఈ సమయంలో కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశాలు బలంగా ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఇది సరైన సమయం. ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా లాభాలు కనిపిస్తాయి. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత, ఆనందం చేకూరుతుంది.
ఈ రాశుల వారికి దీపావళి సమయంలో లక్ష్మీదేవి కృప దక్కుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో మంచి కార్యాలు ప్రారంభించడం, కొత్త పెట్టుబడులు పెట్టడం, భూమి లేదా బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా ఉంటుంది. అలాగే, కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది అనుకూల సమయం.


