Karthika Masam- Zodiac Signs:భారతీయ సంప్రదాయంలో చాలా మంది జాతకాలు, గ్రహ స్థితులు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని నమ్ముతారు. ముఖ్యంగా ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు మంచి రోజు,తిథి,వారం,వర్జ్యం అన్ని చూసుకొని మొదలుపెడుతుండడం మనం చూస్తూనే ఉంటాం. ఈ ఏడాది నేటి నుంచి (బుధవారం ) ప్రారంభమవుతున్న కార్తీక మాసం గురించి పండితులు విశేషంగా చెబుతున్నారు. ఈ పవిత్ర మాసం కొందరి రాశుల వారికి శ్రేయస్సు, సంపద, సానుకూల మార్పులను తెచ్చిపెట్టనుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మాసంలో కొన్ని రాశుల అదృష్టం తారా స్థాయికి చేరుతుందని వారు వివరిస్తున్నారు.
కార్తీక మాసం దేవతారాధనకు, ఆధ్యాత్మిక సాధనకు అత్యంత శుభప్రదమైన కాలంగా పండితులు చెబుతున్నారు. ఈ సారి కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఐదు రాశుల వారికి మంచి ఫలితాలు లభించనున్నాయని జ్యోతిష్య విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read:https://teluguprabha.net/devotional-news/diwali-festival-significance-and-lakshmi-puja-importance/
కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి కార్తీక మాసం చాలా అనుకూలంగా ఉండబోతున్నట్లు . గతంలో ఎదురైన ఆర్థిక ఒత్తిళ్లు ఈ కాలంలో తగ్గుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు, పాత పెట్టుబడులపై మంచి ఫలితాలు అందవచ్చు. కోర్టు వ్యవహారాలు ఉంటే అవి అనుకూలంగా పరిష్కారం పొందే అవకాశం ఉంది. పాత స్నేహితులతో మళ్లీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. పంచాయితీలు, కుటుంబ ఆస్తుల విషయంలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగ రంగంలో ఎదుగుదల, సీనియర్‌ల మద్దతు కూడా లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ నెల ప్రశాంతంగా సాగుతుంది.
తుల రాశి…
తుల రాశి వారు కూడా ఈ మాసంలో అదృష్టాన్ని అందుకోబోతున్నారు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో మెరుగైన మార్పులు సంభవించబోతున్నట్లు పండితులు వివరిస్తున్నారు. రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ వ్యాపారాలలో పెట్టుబడులు పెడితే లాభాలు దక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యుల సహకారం బాగా లభిస్తుంది. తోబుట్టువులు లేదా స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం అందవచ్చు. చదువులలో ఉన్న వారు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. సాధించిన ఫలితాల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కుంభ రాశి..
కుంభ రాశి వారికి కార్తీక మాసం అత్యంత ఫలప్రదంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎదురైన అడ్డంకులు తొలగి వృత్తిపరమైన స్థిరత్వం వస్తుంది. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఎదుగుదల కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టులు విజయవంతం కావచ్చు. ఆర్థిక లాభాలు క్రమంగా పెరుగుతాయి. ఈ కాలంలో ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కుటుంబ సంబంధాలు కూడా బలపడతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. పాత సమస్యలు పరిష్కారమవుతాయి.
సింహ రాశి…
ఇక సింహ రాశివారు ఈ మాసంలో ప్రతి రంగంలోనూ సానుకూల మార్పులను అనుభవించనున్నారు. గతంలో చేసిన కష్టానికి ఫలితం ఈ కాలంలో లభిస్తుంది. వృత్తిపరమైన రంగంలో మంచి అవకాశాలు దొరకవచ్చు. ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ రాశివారికి గ్రహ స్థితులు అనుకూలంగా ఉండటంతో ఏ పనినైనా ధైర్యంగా మొదలుపెట్టవచ్చు. ఆర్థిక స్థితి బలపడటమే కాకుండా పేరు, ప్రతిష్ట కూడా పెరుగుతుంది.
ధనుస్సు రాశి..
ధనుస్సు రాశి వ్యక్తులకు కూడా కార్తీక మాసం శుభపరిణామాలను అందిస్తుంది. వ్యాపారంలో ఉన్న వారు మంచి లాభాలను నమోదు చేస్తారు. కొత్త ఒప్పందాలు విజయవంతంగా కుదురుతాయి. ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతికి అర్హత సాధించవచ్చు. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులు ఈ కాలంలో పూర్తవుతాయి.
Also Read:https://teluguprabha.net/devotional-news/lucky-zodiac-signs-for-diwali-2025-and-their-prosperity/
వ్యక్తిగత సంబంధాల్లో సామరస్యం పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో బంధాలు మరింత బలపడతాయి. ఈ నెలలో వారు మొదలుపెట్టిన కొత్త పనులు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ధనుస్సు రాశివారు భయపడకుండా కొత్త అవకాశాలను స్వీకరించవచ్చు.


