శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీకమాసం ప్రారంభ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు సనుగుల విజయ శ్రీనివాస్ స్రవంతి దంపతులు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా నివేదన ప్రదక్షణ నిర్వహించి అనంతరం మాలదారులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రతి సంవత్సరం కార్తీకమాసం ప్రారంభం నుండి మండల పూజలు ముగిసేంత వరకు మధిర పరిసర ప్రాంత అయ్యప్ప, భవాని, తదితర మాలదారులకు దాతల సహకారంతో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ప్రతిరోజు అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. నేటి నుండి డిసెంబర్ 26 వరకు జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి అవసరమయ్యే బియ్యాన్ని పసూర గ్రూప్ ఆఫ్ చైర్మన్ పబ్బతి వెంకట రవికుమార్ వారి సోదరులు వితరణగా అందజేశారు.
తొలి రోజు మాలదారులకు అన్నదానాన్ని ప్రముఖ వైద్యులు సనుగుల విజయ శ్రీనివాస్ దంపతులు ఏర్పాటు చేశారు. నవంబర్ 16 నుండి డిసెంబర్ 26 వరకు స్వామివారి ఆలయంలో 17 వ వార్షిక మండల పూజలు నిర్వహించనున్నారు. నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 4 వరకు స్వామివారి ఉత్సవాలను కూడా ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, డాక్టర్ వాసిరెడ్డి సతీష్, ఆలయ వ్యవస్థాపక నిర్వాహకులు చలువాది ధర్మారావు, చల్వాది శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు, గురుస్వాములు కోన దామోదర్ రావు, వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, బత్తుల శ్రీనివాసరావు, చెరుపల్లి శ్రీధర్, వలిశెట్టి శ్రీనివాసరావు, పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, మైనీడి జగన్ మోహన్ రావు తదితర మాలదారులు భక్తులు పుర ప్రముఖులు పాల్గొన్నారు.