Thursday, April 10, 2025
HomeదైవంMahabubabad: కనుల పండుగా శివపార్వతుల కళ్యాణం

Mahabubabad: కనుల పండుగా శివపార్వతుల కళ్యాణం

శివరాత్రిలో..

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక వివేకానంద సెంటర్ మార్కండేయ స్వామి టెంపుల్ ఆవరణలో మహాశివరాత్రి సందర్భంగా పూజారి నరసింహ శాస్త్రి మరి కొంతమంది పూజారుల సమక్షంలో ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ముందుగా శివపార్వతుల విగ్రహాలను పల్లకిపై తీసుకొని వెళ్లి భక్తులు ఊరేగించారు.

- Advertisement -

అనంతరం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన శివపార్వతుల కళ్యాణం భక్తులు కన్నులారా తిలకించారు. వేదమంత్రాలు మధ్య జరిగిన ఈ కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ చిట్యాల జనార్ధన్ జిల్లా న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిలకమర్తి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి చెన్నూరి విజయలక్ష్మి, ఇంకా పలువురు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News