Saturday, November 15, 2025
HomeదైవంMahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య రోజు వీటిని దానం చేస్తే.. అన్నీ శుభాలే.!

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య రోజు వీటిని దానం చేస్తే.. అన్నీ శుభాలే.!

Mahalaya Amavasya 2025: అమావాస్య తిథిని దైవరాధనకు చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. అటువంటి అమావాస్య తిథి ఆదివారం రోజు వస్తే ఆ అమావాస్యకి మరింత ప్రాముఖ్యత పెరుగుతుంది. భాద్రప్రద మాసం అమావాస్య రోజుని మహాలయ అమావాస్య అని అంటారు. అటువంటి విశిష్టమైన అమావాస్య ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం వచ్చింది. ఈ నేపధ్యంలో సూర్యుడి అనుగ్రహం కోసం పూజ విధి, చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏమిటో ఇక్కడ చూద్దాం..

- Advertisement -

భాద్రప్రద మాసం అమావాస్య మహాలయ అమావాస్యకి జ్యోతిష శాస్త్ర పరంగా విశేషమైన ప్రముఖ్యత ఉంది. సూర్యుడి అనుగ్రహంతో పాటు పితృ దోషాలు తొలగేందుకు ఆదివారం అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేయడం ఫలవంతం. ఆదివారం అమావాస్య నాడు ఉదయాన్నే నిద్రలేచి.. వీలయితే నదీ స్నానం చేయాలి. వీలు కుదరని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగా జలం వేసుకుని స్నానం చేయాలి. 

Also Read: https://teluguprabha.net/devotional-news/difference-between-boddemma-festival-and-bathukamma-festival/

శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటిలోని పూజ గదిని శుభ్రం చేసి పూజ చేసి.. సూర్య అనుగ్రహం కోసం మంత్రాలు జపించాలి. ధూప దీపంతో పూజాదికార్యక్రమాలను నిర్వహించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత శివుడిని లేదా సూర్యుడిని ప్రార్ధించండి. ఈ రోజున సూర్య దోషం ఉన్నవారు లేదా గ్రహ దోషాలు ఉన్నవారు పేదలకు ఆహారం, బట్టలు, డబ్బును దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

వీటిని సమర్పించండి

మీ పూర్వీకులకు ఆహారాన్ని, తర్పణం అందించండి. నువ్వులు కలిపిన నీటిని సమర్పించి తర్పణం విడవండి. అమావాస్య అంటే చంద్రుడు లేని రోజు కనుక శివుడిని ప్రార్థించడం ఒక శక్తివంతమైన రోజు. శివుడికి పాలు, తేనె, బిల్వ పత్రాలు సమర్పించండి. పూర్వీకులు, త్రిమూర్తులు నివసించే రావి చెట్టుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున రావి చెట్టుకు పాలు, చక్కెర కలిపిన నీటిని సమర్పించి పూజించండి.

Also Read: https://teluguprabha.net/devotional-news/festivals-in-october-2025-check-important-dates-for-dussehra-karwa-chauth-diwali-and-more/

ఈ దానాలు చేస్తే శుభ పరిణామాలు

పేదవారికి, దేవాలయాలకు లేదా బ్రాహ్మణులకు ఆహారం, బట్టలు , డబ్బును దానం చేయండి. చేపలకు ఆహారంగా అటుకులు వంటి వాటిని అందించండి. చీమలు, కాకులు, ఆవులకు ఆహారం అందించండి. నల్ల నువ్వులు: నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శనీశ్వర ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు.

ఇవి చేయకండి

ధ్యాత్మిక అంతర్దృష్టిని పొందడానికి కొంతకాలం మౌనం పాటించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా “ఓం నమః శివాయ” మంత్రం లేదా పితృ గాయత్రీ మంత్రం జపించండి. సాత్విక ఆహారాన్ని తినాలి. ఉల్లి, వెల్లుల్లి తినొద్దు. ఎవరి గురించి చెడుగా చెప్పవద్దు. వాదించవద్దు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం, వాహనాలు లేదా బట్టలు వంటి కొత్త వస్తువులను కొనవద్దు. జుట్టు లేదా గోర్లు కత్తిరించడం వంటి పనులు కూడా చేయవద్దని పండితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad