Tuesday, September 10, 2024
HomeదైవంMahanandi: మహానంది మండలంలో ఘనంగా నాగ పంచమి,శ్రావణ మాస పూజలు

Mahanandi: మహానంది మండలంలో ఘనంగా నాగ పంచమి,శ్రావణ మాస పూజలు

మహానంది మండలంలో నాగ పంచమి వేడుకలు భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు నాగుల కట్ట, పుట్టల దగ్గర పాలు పోసి, ధూప నైవేద్యాలు సమర్పించారు.

- Advertisement -

మహానంది క్షేత్రంలో శ్రావణమాసం పంచమితో కూడిన తొలి శుక్రవారం సందర్భంగా ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ కామేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు,అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, పూలంగిసేవ, మహాలక్ష్మి హోమం వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

మహానంది ఆలయంతో పాటు నవనందులలో ఒకటైన సూర్యనంది క్షేత్రంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారికి ఆలయ అర్చకులు కృష్ణ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం,కుంకుమార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News