Sunday, July 7, 2024
HomeదైవంMahanandi: మహానందిలో వైభవంగా దేవి నవరాత్రులు

Mahanandi: మహానందిలో వైభవంగా దేవి నవరాత్రులు

రావణ వాహనంపై మహాగౌరీ దుర్గగా శ్రీ కామేశ్వరి అమ్మవారు

మహానంది పుణ్యక్షేత్రంలో దేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని శ్రీ కామేశ్వరి అమ్మవారు రావణ వాహనంపై మహాగౌరీ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా శ్రీ కామేశ్వరి అమ్మవారి మూలవిరాట్ కు పండితులు,అర్చకులు,విశేష దవ్యాభిషేక అర్చనలు, ప్రత్యేక అలంకార పూజలు నిర్వహించారు. ప్రత్యేక యాగశాలలో వేద పండితులు, రుత్వికులు, కలశ పూజలు, రుద్ర, చండీ హోమాలు నిర్వహించారు.అనంతరం కూష్మండ బలి ఇచ్చి, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం అలంకార మండపంలో వేదపండితులు, అర్చకులు శ్రీ కామేశ్వరి అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ, అష్టవిధ మహా మంగళహారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం శ్రీ కామేశ్వరి అమ్మవారిని రావణ వాహనంపై మహాగౌరీ దుర్గగా ఆశీనులు గావించి, వేద పండితులు రవిశంకర్ అవధాని బృందం ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, నేటి ఉభయ దాతలుచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కూష్మండ నారికేళ బలి ఇచ్చి, ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ మాఢవీధుల్లో అమ్మవారికి ఆశేష భక్తజనం నడుమ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News