Sunday, October 6, 2024
HomeదైవంMahanandi: మహానందిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Mahanandi: మహానందిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలో ఘనంగా కనుమ పండుగ వేడుకలు నిర్వహించారు. హనుమంత వాహనంపై కొలువైన శ్రీ సీతా సమేత కోదండరాముల వారికి విశేష పూజలు నిర్వహించి, పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు.

- Advertisement -

మహానంది క్షేత్రంలో కనుమ పండుగ సందర్భంగా ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గోశాలలోని గోవులను సుందరంగా అలంకరించి ఘనంగా గోపూజలు నిర్వహించారు.

అనంతరం ముగ్గుల పోటీలలో విజేతలైన వారికి బహుమతులు.అనంతరం హనుమంత వాహనంపై శ్రీ సీతా సమేత కోదండ రాముల వారికి కన్నుల పండుగగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు,దేవస్థానం అధికారులు మరియు సిబ్బంది,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News