Thursday, July 4, 2024
HomeదైవంMahanandi: మహానందిలో ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Mahanandi: మహానందిలో ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు

వైభవంగా త్రిశూలస్నానం

మహానంది క్షేత్రంలో మహా పూర్ణహుతితో శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసాయి. ఐదు రోజులపాటు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఆలయంలోని యాగశాలలో ఈవో చంద్రశేఖర్ రెడ్డి, సుధాకుమారి దంపతులచే వేద పండితులు, రుత్వికులు ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. కలశ ఉద్వాసన, రుద్రగుండం కోనేరులో త్రిశూలస్నానం వైభవంగా నిర్వహించారు.

- Advertisement -

ముందుగా శ్రీ గంగా కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివారితో పాటు పెళ్లి పెద్దలైన శ్రీ పార్వతి సమేత బ్రహ్మానందీశ్వర స్వామివార్లకు స్థానిక నందితీర్థం (రుద్రగుండం) కోనేరులో సుగంధ పరిమళ దవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ధ్వజ అవరోహణం కార్యక్రమం, బ్రహ్మోత్సవ యాగఫల సమర్పణ, నాగబలి పూజ నిర్వహించారు. సాయంత్రం నూతన దంపతులైన శ్రీ కామేశ్వరి సహిత మహానందీ స్వామి వారికి వైభవంగా తెప్పోత్సవం వేడుకలు నిర్వహించారు.

స్థానిక రుద్రగుండం కోనేరులో పండితులు, అర్చకులు పల్లకిలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి, పూజ దాతలు నంద్యాలకు చెందిన అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు.

ఈ కార్యక్రమంలో కూరగాయల దాత లక్కబోయిన ప్రసాద్, ఆదిలక్షమ్మ దంపతులు, ఏఈఓ మధు, దేవస్థానం అధికారులు సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News