Wednesday, November 13, 2024
HomeదైవంMahanandi: వాడ వాడలా శ్రీరామ నవమి వేడుకలు

Mahanandi: వాడ వాడలా శ్రీరామ నవమి వేడుకలు

వైభవంగా సీతారాముల కళ్యాణం

మహానంది మండలంలో అన్ని గ్రామాల్లో వాడవాడలా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు. మహానంది మండలంలోని తిమ్మాపురం, అబ్బీపురం గ్రామంలో శ్రీరామ నవమి పండగ పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. తిమ్మాపురం గ్రామంలో రెంటచింతల రఘుకుమార్ శర్మ, కాకమాను శంకర్ శాస్త్రి ఆధ్వర్యంలో రామాలయం దగ్గర శ్రీ సీతారామ లక్ష్మణ స్వాముల వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు.

- Advertisement -

ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ పూజ, కన్యాదానం, సుముహూర్తంలో మాంగల్య ధారణ, అక్షత లోపణం, దేవాలయ ప్రదక్షిణ పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణ స్వామి వారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. రాముల వారి తరుపున పులిమద్ది విజయ భాస్కరు, లక్ష్మీదేవి దంపతులు, సీతాదేవి తరపున రాజశేఖర్ పద్మావతి దంపతులు కళ్యాణ దాతలుగా వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తుల పాల్గొని స్వామివారి కళ్యాణంను వీక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News