Maha Purush Yoga 2025 Effect: పురాణాల ప్రకారం, బృహస్పతిని దేవగురువుగా పిలుస్తారు. నవగ్రహాల్లో పెద్దది ఈ గురు గ్రహం. ఇది 12 ఏళ్ల తర్వాత మిథునరాశిలోకి ప్రవేశించబోతుంది. దీని కారణంగా అక్టోబరు నెలలో ఎంతో పవర్ పుల్ మహాపురుష రాజయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారి ఫేట్ మారబోతుంది. వీరికి దేనికీ లోటు ఉండదు. పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఆ లక్కీ రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం.
మిథున రాశి
బృహస్పతి ఈ రాశిలో సంచరించడం వల్లే ఈ మహాపురుష రాజయోగం రూపుదిద్దుకుంటుంది. ఇది చాలా పవిత్రమైన రాజయోగం. దీని ప్రభావం చేత మీ కీర్తి నలువైపలా వ్యాపిస్తుంది. మీరు ఆర్థికంగా ఎవరూ అందుకోలేని స్థితిలో ఉంటారు. ఉద్యోగులకు బోనస్ లు రావడంతోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. మీరు అనుకున్న పని జరుగుతుంది. దారిద్ర్యం దాదాపు దూరమవుతుంది. వివాహ ప్రస్తావన రావచ్చు. మీ కుటుంబ సభ్యులు అనారోగ్యం నుంచి బయటపడతారు.
కుంభరాశి
మహాపురుష రాజయోగ ప్రభావంతో కుంభరాశి వారు ధనవంతులు కాబోతున్నారు. శని అనుగ్రహం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. పూర్వీకుల స్థిర చరాస్తులు కలిసి వస్తాయి. అప్పులన్నీ తీరుస్తారు. హెల్తీగా ఉంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సోసైటీలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. డబ్బు సమస్యలు ఉండవు. ఖర్చులకు తగ్గ ఆదాయం వస్తుంది. భార్యభర్తల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. సంతానప్రాప్తి కలగవచ్చు. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి.
తులా రాశి
తులా రాశి వారికి మహాపురుష రాజయోగ కలిసి వస్తుంది. వీరు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఊహించని ధనలాభం ఉంటుంది . బిజినెస్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగ యువతకు జాబ్స్ వస్తాయి. కాలం కలిసి వచ్చి మీరు విదేశాలకు కూడా వెళ్లే అవకాశం కూడా ఉంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఈ సమయంలో ఎందులో పెట్టుబడి పెట్టిన మీకు రెట్టింపు లాభాలను తెచ్చి పెడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమలో విజయం సాధిస్తారు.