మక్తల్ పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి మాత లలితా దేవి అలంకరణలో శుక్రవారం దర్శనం ఇచ్చారు. ఉదయం గణపతి ప్రార్ధన, సాయంత్రం సామూహిక కుంకుమార్చన బతుకమ్మలను ప్రతి ఇంటి నుంచి అంగరంగ వైభవంగా తయారు చేసుకుని ఆలయంలో మహిళలు, చిన్నారులు ఆటపాటలతో, దాండియా నృత్యాలతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మ పాటలతో దేవాలయ ప్రాంగణం మొత్తం మారుమ్రోగింది.
అనంతరం భజన భక్తులు భజనలతో పాటలు పాడుతూ వారితో పాటు వచ్చిన భక్తులు శ్రద్ధతో, భక్తితో భజనలు చేశారు. ఉదయం నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు తీర్చుకుంటున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ… కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు కొలువై ఉన్నారని, అమ్మవారు ఇక్కడ వచ్చి స్వయంగా కొలువై ఉన్నారని ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనదని ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందని ప్రజల నమ్మకం సాయంత్రం అమ్మవారు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు, పూజా కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు, పురుషులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయినారు. అనంతరం వచ్చిన భక్తులకు అల్పాహారం వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, పట్టణ ప్రజలు, భక్తులు,చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.