Tuesday, June 24, 2025
HomeదైవంVenus Transit 2025: మరో వారం రోజుల్లో ధనవంతులు కాబోతున్న రాశులివే.. మీది ఉందా?

Venus Transit 2025: మరో వారం రోజుల్లో ధనవంతులు కాబోతున్న రాశులివే.. మీది ఉందా?

Malavya Raja Yogam Effect: గ్రహాల సంచారం కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ నెల చివరిలో అంటే జూన్ 29న శుక్రుడు తన సొంతరాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇతడు జూలై 26 వరకు అదే రాశిలో సంచరిస్తాడు. శుక్రుడు యెుక్క ఈ రాశి మార్పు కారణంగా అరుదైన మాలవ్య రాజయోగం ఏర్పడబోతుంది. ఈ రాజయోగం కొందరి జీవితాల్లో వెలుగులు నింపబోతుంది. ఆ అదృష్ట రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం.

- Advertisement -

వృషభరాశి
ప్రకాశవంతమైన శుక్రుడు ఇదే రాశిలో మాలవ్య రాజయోగాన్ని సృష్టించబోతున్నాడు. దీంతో వృషభరాశివారు శాశ్వతకీర్తిని గడించబోతున్నారు. వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా గడుపుతారు. ధనం వృద్ధి చెందుతారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీరు పేదరికం నుండి విముక్తి పొందుతారు. వివాహం కాని యువతీయువకులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

మీన రాశి
శుక్రుడు సంచారం వల్ల మీనరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీనరాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అనుకోని అతిథులు మీ ఇంటికి వస్తారు. కుటుంబ సభ్యుల మధ్య బంధం మరింత గట్టి పడుతుంది.

కన్యారాశి
మాలవ్య రాజయోగం కన్యారాశి వారి కష్టాలన్నీ తొలగిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న వస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ శాలరీ పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు భారీగా లాభాలను ఇస్తాయి. వ్యాపారం వృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు మంచి పొజిషన్ కు వెళ్తారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. డబ్బు సమస్యలు తీరిపోతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News