Wednesday, February 12, 2025
HomeదైవంManchiryala: సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

Manchiryala: సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

152 జంటలతో..

మాఘ పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల గోదావరి తీరంలోని గౌతమేశ్వర ఆలయం ప్రాంగణంలో మంచిర్యాల వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో 152 ఆర్యవైశ్య దంపతులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో

అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తున్న వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ గడియారం బాలాజీ శర్మ వేదమంత్రాలు మధ్య సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వైభవంగా చేయించారు. గత మూడు సంవత్సరాలుగా గౌతమేశ్వరాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున 11 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తుండగా బుధవారం మాఘ పౌర్ణమి సందర్భంగా 102 గోత్రాల ఆర్యవైశ్యులు 152 జంటలతో ఈ వ్రతాలను నిర్వహించారు.

ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో వాసవి క్లబ్ అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ ముక్తా శ్రీనివాస్, ప్రోగ్రాం చైర్మన్ పడకంటి శ్రీనివాస్, ఆలయ ఫౌండర్ గోపగారి శ్రీదేవి, రీజియన్ చైర్మన్ కేశెట్టి వంశీకృష్ణ, ప్రోగ్రాం క్యాషియర్ నకిరేకొమ్ముల రాజేంద్రప్రసాద్ తోపాటు మంచిర్యాల వాసవి క్లబ్, వనిత క్లబ్, కపుల్స్ క్లబ్, యూత్ క్లబ్ నాయకులు, దాతలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News