Mangal Varun Gochar 2025: నవగ్రహాల్లో చాలా శక్తివంతమైన గ్రహం కుజుడు. అలాంటి అంగారక గ్రహ రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిపై కనిపిస్తుంది. ఇటీవల కుజుడు వృశ్చిక రాశి ప్రవేశం చేశాడు. తన సొంత రాశిలో అంగారకుడు సంచరించడం వల్ల ఇప్పటికే రుచక రాజయోగాన్ని ఏర్పరిచాడు. అయితే ఈ క్రమంలో అతడు నెప్ట్యూన్ లేదా వరుణుడితో కలిసి నవంబర్ 04న నవపంచమ రాజయోగాన్ని సృష్టించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
తులా రాశి
నవపంచమ రాజయోగం తులారాశి వారికి శుభకరంగా ఉంటుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వ్యాపారాలు భారీగా లాభాలు గడిస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. ఉద్యోగాలు చేసేవారు ట్రాన్సఫర్ అవ్వడానికి ఇదే మంచి సమయం.
మేష రాశి
కుజుడు మరియు వరుణుడు సంచారం వల్ల మేష రాశి వారి మంచి ఫలితాలను పొందుతారు. మీ కెరీర్ లో పురోగతికి తలుపులు తెరుచుకుంటాయి. మీరు పని చేసే చోట ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగం చేయాలనే మీ కోరిక నెరవేరుతోంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
Also read: Vaikuntha Chaturdashi 2025 -వైకుంఠ చతుర్దశి నవంబర్ 4 లేదా 5నా? సరైన తేదీ, శుభ ముహూర్తం తెలుసుకోండి..
కన్యా రాశి
కన్యా రాశి వారికి నవపంచమ రాజయోగం ఎంతో మేలు చేస్తుంది. మీ కోరికలు సకాలంలో నెరవేరతాయి. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. కెరీర్ లో విజయాన్ని సాధిస్తారు. పూర్వీకుల ఆస్తులు మీకు లభిస్తాయి. లవ్ లైఫ్ బాగుంటుంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు. కోర్టు కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం నిజమైనదని ఖచ్చితంగా చెప్పలేం. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు. ఈ కథనాన్ని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


