Monday, June 24, 2024
HomeదైవంMantralayam: భక్తులకు నిజ బృందావనం దర్శనం

Mantralayam: భక్తులకు నిజ బృందావనం దర్శనం

ఏకాదశి కావడంతో ..

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో.. రాఘవేంద్ర స్వామి నిజ బృందావన దర్శనం భక్తులకు లభించింది. ఆదివారం ఏకాదశి కావడంతో మఠంలో నిత్య పూజలకు విరామం పలికారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్వామి నిజ బృందావనాన్ని దర్శించుకున్నారు. నెలలో ఒకసారి నిజ బృందావనం దర్శనం కలగడం ఆనందంగా భావిస్తున్నారు.

- Advertisement -

గ్రామ దేవత మంచాలమ్మ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని భక్తులు దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పూర్వ పీఠాధిపతుల మూల బృందావనాలను దర్శించుకున్నారు. స్వామి బృందావనానికి జలాభిషేకం, తులసి దళాల పూజలు నిర్వహించి కాషాయ వస్త్రంతో అలంకరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News