Friday, September 20, 2024
HomeదైవంMantralayam: మంత్రాలయం పురవీధుల్లో ఊరేగిన రాఘవేంద్ర స్వామి

Mantralayam: మంత్రాలయం పురవీధుల్లో ఊరేగిన రాఘవేంద్ర స్వామి

హెలి కాఫ్టర్ పైనుంచి రథంపై పూలవర్షం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం పురవీధుల్లో రాఘవేంద్ర స్వామి మహా రథోత్సవం మహదానందంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు నడుమ రాఘవేంద్ర స్వామి మహారథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

- Advertisement -

రాఘవేంద్ర స్వామి 353 వ ఆరాధన సప్త రత్రోత్సవల్లో భాగంగా గురువారం ఉత్తరారధోత్సవం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి పూర్వతరం ప్రహ్లాద రాజులను శ్రీరామ అవతారంలో అలంకరించారు.

సాంప్రదాయ ప్రాకారం ముందుగా పల్లకిలో స్వామివారిని గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠానికి ఊరేగుంపుగా తీసుకెళ్ళారు. అక్కడ వేద పండితులు, విద్యార్థులు స్వామి వారికి వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం రాఘవేంద్ర స్వామీ మూల బృందావన వద్ద పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు స్వామి బృందావనానికి, రంగులు చల్లి వసంతోత్సవం నిర్వహించారు.

మంగళ హారతి ఇచ్చి ప్రహ్లాద రాజు స్వామికి వసంతోత్సవం, మంగళ హారతి ఇచ్చి భక్తులపై రంగులు చల్లారు. రామ అవతారం లో ఉన్నా ప్రహ్లాద రాజులను మహారథోత్సవం దగ్గరకు చేర్చారు. మహారథంపై స్వామీ వారిని కొలువుదీర్చి రెండు గంటలకు ఊరేగింపును ప్రారంభించారు.

రాఘవేంద్ర స్వామి మఠం నుంచీ మంత్రాలయం పురవీధుల్లో ఊరేగించారు. హెలిక్యాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. ప్రధాన కూడలి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా తిరిగి మఠం వరకు ఊరేగించరు.

ఊరేగింపులో రథం ముందు భక్తులు కోలాటాలు, భక్తి నృత్యాలు, వేషధారణలు, భక్తి భజనలు, కీర్తనలు ఆకట్టుకున్నాయి. రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి నవరత్నాల కవచం అలంకరణ, మహా మంగళ హారతి ఇచ్చారు.

మూల రాముల పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సుభూదేంద్ర తీర్థులు మాట్లాడుతూ.. వర్షాలు సకాలంలో కురిసి పంటలు రైతులు సుభిక్షంగా ఉండాలన్నారు. మంత్రాలయం భక్తులు, ప్రభుత్వాల సహకారంతో మరింత అభివృద్ది చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News