Saturday, November 15, 2025
HomeదైవంMargashira Masam 2025: మార్గశిర మాసంలో రాబోయే పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?

Margashira Masam 2025: మార్గశిర మాసంలో రాబోయే పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?

Margashirsha Month 2025 Festivals: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం నడుస్తోంది. ఈ నెల 21న మార్గశిర మాసం మెుదలుకానుంది. అయితే ఈ మార్గశిర మాసం ఇప్పటికే నార్త్ ఇండియాలో నవంబర్ 06 నుంచి ప్రారంభమైంది. ఇది పండుగలు, వ్రతాల పరంగా శుభప్రదమైన నెల. శ్రీకృష్ణుడు మరియు విష్ణువును పూజించడానికి అంకితం చేయబడిన పవిత్రమైన మాసం. ఈ శుభకరమైన నెలలోనే రోహిణి వ్రతం, సంకష్టి చతుర్థి, కృష్ణ జన్మాష్టమి, కాలాష్టమి, ఉత్పన్న ఏకాదశి, మార్గశీర్ష అమావాస్య మరియు సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పండుగలు రాబోతున్నాయి.

- Advertisement -

మార్గశిర మాసం పండుగలు, వ్రతాలు
నవంబర్ 6, 2025 గురువారం- మార్గశిర మాసం ప్రారంభం
నవంబర్ 7, 2025 శుక్రవారం- రోహిణి వ్రతం
నవంబర్ 8, 2025 శనివారం- గణాధిప సంకష్టి చతుర్థి
నవంబర్ 11, 2025 మంగళవారం- మాసిక్ కృష్ణ జన్మాష్టమి
నవంబర్ 12, 2025 బుధవారం- కాలభైరవ జయంతి, కాలాష్టమి
నవంబర్ 15, 2025 శనివారం- ఉత్పన్న ఏకాదశి
నవంబర్ 16, 2025 ఆదివారం- వృశ్చిక సంక్రాంతి
నవంబర్ 17, 2025 సోమవారం- సోమ ప్రదోష వ్రతం
నవంబర్ 18, 2025 మంగళవారం- మాసిక్ శివరాత్రి

Also Read: Astrology-18 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారం..

నవంబర్ 19, 2025 బుధవారం- దర్శ అమావాస్య
నవంబర్ 20, 2025 గురువారం- మార్గశీర్ష అమావాస్య
నవంబర్ 21, 2025 శుక్రవారం- ఇష్టి
నవంబర్ 22, 2025 శనివారం- చంద్ర దర్శనం
నవంబర్ 24, 2025 సోమవారం- వినాయక చతుర్థి
నవంబర్ 25, 2025 మంగళవారం- వివాహ పంచమి, నాగ పంచమి
నవంబర్ 26, 2025 బుధవారం- సుబ్రహ్మణ్య షష్ఠి
నవంబర్ 28, 2025 శుక్రవారం- మాసిక్ దుర్గాష్టమి
డిసెంబర్ 1, 2025 సోమవారం- గురువాయూర్ ఏకాదశి, మోక్షద ఏకాదశి
డిసెంబర్ 2, 2025 మంగళవారం – మత్స్య ద్వాదశి, భౌమ ప్రదోష వ్రతం
డిసెంబర్ 4, 2025 గురువారం- దత్తాత్రేయ జయంతి, మార్గశీర్ష పూర్ణిమ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad