Thursday, September 19, 2024
HomeదైవంMargasira Masam speciality: మాసాలల్లో మార్గశిరాన్ని నేనే అనే విష్ణుమూర్తి

Margasira Masam speciality: మాసాలల్లో మార్గశిరాన్ని నేనే అనే విష్ణుమూర్తి

మీ శక్తికొద్దీ, భక్తితో, హృదయపూర్వకంగా నమస్కారం చేయండి

మనకున్న పండుగలు, వ్రతాలు, పూజలకు చాలా లోతైన అర్థం, పరమార్థం ఉంది.  ఇవేవో మనం గుడ్డిగా పాటిస్తున్నవి కానేకావు.  సీజనల్ గా, ఆరోగ్యపరంగా, వాతావరణం పరంగా, ప్రకృతి పరంగా..ఆధ్యాత్మిక పరంగా మనకు పండుగలు వస్తాయి.  కొన్ని నెలల్లో .. తెల్లారే స్నానం చేయాలని.. ఉపవాసం ఉండాలని చెప్పటంలో.. ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా.. అన్నట్టు.. విష్ణువు అత్యంత ఇష్టమైన నెల.. ధనుర్మాసం ఇప్పుడు కొనసాగుతోంది.  మరి ధనుర్మాసం ప్రత్యేకత ఏంటో..అసలు ధనుర్మాసాన్ని ఎలా పాటించాలి.. ఎందుకు పాటించాలో తెలుసుకుందామా.

- Advertisement -

లైఫ్ స్టైల్ ఛేంజెస్ తప్పవు

మన తెలుగు నెలల్లో.. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం, ధనుర్మాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.  ఈనెలల్లో ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎక్కువ కాబట్టి.. ఇవి శ్రేష్టమైన నెలలుగా పాటిస్తాం.  అంతేకాదు.. సిస్టమ్యాటిక్ గా.. డిసిప్లైన్డ్ గా ఈనెలలో మనం గడపాలి.  ఇలా లైఫ్ స్టైల్ ఛేంజెస్ ఈ నాలుగు నెలల్లో చేసుకోవటంవల్ల.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి.  ఎందుకంటే.. ఈ నెలల్లో .. వాతావరణాన్నిబట్టి.. ఏం తినాలి.. ఏంతినగూడదని పెద్దలు కచ్ఛితంగా చెబుతారు.  ఇలా చేస్తే.. మీకు కొత్త జబ్బులు రావు..ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని పెద్దగా బాధపెట్టవు.

పెళ్లికాని వారి కోసం ప్రత్యేకం..

కార్తీక మాసం తరువాత.. ధనుర్మాసం.. అత్యంత శ్రేష్ఠమైన మాసంగా మనం పాటిస్తాం.  ఈ నెలలో పెళ్లికానివారు.. గోదా కల్యాణం చూడటం.. లేదా గోదా కల్యాణం చేయించటం చేస్తారు.  ఇలా చేస్తే.. పెళ్లి కచ్ఛితంగా అవుతుందనేది మన విశ్వాసం.  గోదా కల్యాణం సకల శుభకరం కూడా.  ధనుర్మాసమంతా.. గోదా దేవి స్మరణలోనే అవుతుంది.  విష్ణుమూర్తికి బాగా ఇష్టమైన మాసం.. ధనుర్మాసం.  వైష్ణవులు ధనుర్మాసంలో.. నెలంతా ప్రత్యేక పూజలు చేస్తారు. 

నదీ, సముద్ర స్నానాలు..

చలిని ఏమాత్రం లెక్కచేయకుండా..ప్రవహించే నదులు, సముద్రాల్లో స్నానాలు చేయటం.. ఈ మాసం స్పెషాలిటీ.  ఇంట్లో కూడా ఈనెలంతా వీలైనంత ఎర్లీగా స్నానం చేసి.. శ్రీమహావిష్ణువుకు చేతనైనంత పూజలు, వ్రతాలు చేస్తారన్నమాట.  వైష్ణవధామాల్లో.. భక్తులు ఎక్కువ సంఖ్యలో కనిపించే నెల ఇదే. శ్రీరంగం, తిరుపతి వంటి చోట్ల మీకు.. వైష్ణవుల సందడి చాలా ఎక్కువ కనిపిస్తుంది.

ముగ్గులు మరింత ప్రత్యేకం

ఇంటి ముందు ముగ్గులు మనం ఏడాదంతా వేస్తాం కానీ.. ధనుర్మాసంలో.. స్పెషల్ గా వేసే రంగోలీలు కూడా  ఉంటాయి.   ముఖ్యంగా పల్లెల్లో.. వీటిని తప్పకుండా వేస్తారు.  తమిళనాడులో.. ధనుర్మాసం వైభవం చూడాలంటే  రెండు కళ్లు చాలవంటే నమ్మండి.   ఈనెలంతా విష్ణువు రూపాలైన వెంకటేశ్వర స్వామి, రాములోరి గుళ్లు, రంగనాథ స్వామి గుళ్లు..ఇలాంటివన్నీ కళకళలాడతాయి.  విష్ణుసహస్ర నామం పారాయణం చేస్తే ఈ నెలలో చాలా మంచిది.  అందుకే రోజూ.. మీ ఇంట్లో తెల్లవారు జామున లేవగానే.. విష్ణుసహస్ర నామం ప్లే చేయండి. 

ఇష్టం-శ్రేష్ఠమైన మాసం కాబట్టి..

మాసాలల్లో మార్గశిరాన్ని నేనే అని సాక్షాత్తూ విష్ణుదేవుడు స్వయంగా చెప్పారు. అంటే.. ఆయనకు ఈనెలంటే ఎంత పవిత్రమైనదో.. శ్రేష్ఠమైనదో అర్థమైంది కదా.  మరి విష్ణు అనుగ్రహం కావాలంటే..ఆయనకు ప్రీతికరమైన ఈ నెలలో ఆరాధన చేయాల్సిందే.  మీ శక్తి మేరకు, అనుకూలంకొద్దీ, మనస్ఫూర్తిగా విష్ణుమూర్తిని తలచుకోండి.. పూజలు, వ్రతాలు చేయండి. 

ధనుర్మాసం అంటే?

సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈనెలను ధనుర్మాసం అంటారు.  సంక్రాంతి అంటే మకర సంక్రమణ జరిగేవరకు ధనుర్మాసం ఉంటుంది.  ధనుర్మాసం ఎందుకు నిష్ఠగా, మనస్ఫూర్తిగా చేయాలి ఇదే కదా మీ డౌట్.  ధనూరాశికి అధిపతి.. బృహస్పతి.  బృహస్పతి అంటే మీకు తెలుసు కదా.. దేవతల గురువు.. ఈయన అత్యంత జ్ఞానవంతుడు.  కాబట్టి ధనుర్మాసం ఆచరిస్తే.. మీరుకూడా జ్ఞానవంతులు అవుతారు.  అంతేకాదు.. విష్ణుమూర్తిని పూజిస్తే.. ఐశ్వర్యవంతులూ అవుతారని పురాణాల్లో ఉంది. ధనుర్మాసంలో విష్ణువును..మధుసూదనుడని పిలుస్తారు.  అందుకే మధుసూదన వ్రతాన్ని కొన్ని ప్రాంతాల్లో, కొందరి ఇళ్లలో సంప్రదాయంగా చేస్తారు.

అలంకార ప్రియాయ నమః

శివయ్యకు ఓ చెంబు నీళ్లు వేసి..ఓం నమఃశ్సివాయ అంటే సంతృప్తి చెందుతాడు.  కానీ విష్ణువు అలాకాదు.. ఆయన అలంకార ప్రియుడు. బంగారు మొదలు.. నవరత్నాలు, పూలు, పరిమళ సుగంధాలు, పట్టు పీతాంబరాలు..ఇలా మీరు ఎంత అలంకారం చేస్తే అంత ఆనందిస్తాడు విష్ణువు.  ఇక వీటన్నింటికంటే ఆయనకు తులసి అంటే చాలా ఇష్టం.  విష్ణురూపమైన కృష్ణుడికి.. తులసీదళం అంటే ఎంత ఇష్టమో.. మీరు కృష్ణతులాభారంలో చూసే ఉంటారు కదూ.  కాబట్టి.. తులసీ దళంతో విష్ణువును పూజించటం మరవద్దు. 

నగర సంకీర్తనం ఓ సంప్రదాయం..

చిన జియ్యర్ స్వామి ఫాలోయర్స్..ఈనెలంతా..తెల్లవారుజామున నగర సంకీర్తనం చేయటాన్ని మనం చూస్తూనే ఉంటాం కదా.  ఇలా చాలా ఊళ్లలో.. వైష్ణవులు..తిరుప్పావై పాశురాలు చదువుతూ.. ఊరంతా, లేదా వీధంతా తిరుగుతూ.. పూజించే విధానం అత్యంత శ్రేష్ణమైనదికూడా.

ప్రసాదంగా పొంగలే ఎందుకు?

ఇక ఈనెల్లో మీరు వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్తే.. ఎన్ని వెరైటీల ప్రసాదం ఇస్తారో.  వీటికి కూడా చాలా ప్రత్యేకత ఉందనే విషయం మీకు తెలుసా.  పొగమంచు కురిసే నెల కాబట్టి.. చలి, జ్వరం, దగ్గు, జలుబు చాలా సహజంగానే అందరికీ వస్తుంది.  కానీ విష్ణు ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలు వేడిగా స్వీట్ పొంగల్, హాట్ పొంగల్, పెరుగన్నం ఇస్తారు.  వీటిలో ఔషధ గుణాలన్నీ ఉంటాయి.  అంటే వాత,కఫ, పైత్య, శ్లేష దోషాలన్నీ పోగొట్టే మెడిసినల్ వాల్యూస్ ఉన్న నెయ్యి, మిరియాలు, పసుపు, పెరుగు, పచ్చకర్పూరం లాంటివన్నీ వేసి చేసిన ప్రసాదం..ఆరోగ్యానికి మంచిది కూడా.  అంటే సీజనల్ వ్యాధులు పోగొట్టేలా ఈ ప్రసాదాలు మంచి చేస్తాయన్నమాట.

తప్పనిసరిగా గుమ్మడి వంటలు

ఈ సీజనల్ గుమ్మడికాయలు ఎక్కువ పండుతాయి. కాబట్టి.. గుమ్మడి కాయతో రకరకాల వంటలు చేసి.. నైవేద్యంగా పెడతారు. గుమ్మడి కాయ తింటే వజ్రకాయం వస్తుందని  ఆయుర్వేదం చెబుతుంది.  కాబట్టి..ధనుర్మాసంలో మార్కెట్ ను ముంచెత్తే గుమ్మడికాయతో మీకు నచ్చిన వెరైటీలన్నీ తినండి. ఆరోగ్యంగా ఉండండి.

ఆండాళమ్మ భక్తికి మెచ్చి వచ్చి..

విష్ణుభక్తురాలు ఆండాళమ్మ భక్తికి మెచ్చి.. సాక్షాత్తూ ఆ రంగనాథ స్వామి.. దిగివచ్చిన పవిత్ర మాసంగా.. ధనుర్మాసం మనందరికీ శ్రేష్టమైన నెల. ధనుర్మాసం అయిపోయిందంటే..ఇక దక్షిణాయనం అయిపోయినట్టు లెక్క. ఉత్తరాయణం అంటే మంచి రోజులు స్టార్ట్ అవుతాయి.  సంక్రాంతితో.. ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ధనుర్మాసం ముగుస్తుంది.

సుప్రభాతం కాదు తిరుప్పావై సేవ మాత్రమే

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి.. ఈ ధనుర్మాసంలో.. సుప్రభాత సేవ ఉండదు.  గోదాదేవి రాసిన తిరుప్పావై రోజూ ఉదయం సుప్రభాతం సమయంలో పాడుతారు.  ధనుర్మాసం పూర్తవ్వగానే.. మళ్లీ సుప్రభాత సేవను మొదలుపెడతారు. విష్ణువుకు..తన భక్తురాలైనా గోదాదేవి రాసిన తిరుప్పావై పాశురాలంటే చాలా ఇష్టం.  అందుకే రోజుకు ఒక్క పాశురాన్నైనా చదివి.. అర్థం చేసుకోవాలని పెద్దలు చెబుతారు.

ధనుర్మాసం-వింటర్ టూర్స్..

సూర్యుడికి ఉన్న ఆలయాలే చాలా రేర్ కదా.  అరసవెల్లి వంటి సూర్యాలయాలు.. ధనుర్మాసంలో దర్శించటం అత్యుత్తమం.  వైష్ణవ క్షేత్రాలు.. ఈనెలలో దర్శించటం మంచి ఫలితాన్నిస్తుంది. అంటే వింటర్ టూరిజం కూడా.. ధనుర్మాసంలో ఉందన్నమాట.  బదరీనాథ్ మొదలు.. దేశంలోని అన్నివైష్ణ ధామాలు దర్శించటాన్ని.. కొందరు భక్తులు కార్యక్రమంగా పెట్టుకుంటారు.  ఈనెలలో చేసే పుణ్యక్షేత్ర పర్యటనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

ఈ నెలలో హైలైట్స్ ఇవే..

తిరుప్పావై పఠనం, గోదాకల్యాణం, ఆండాళమ్మ పూజలు..ఇవన్నీ ఈ నెలలో హైలైట్స్.  భూదేవి.. ఆండాళ్ అమ్మగా అవతరించి.. రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై.  ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైన అని అర్థం.. పావై అంటే వ్రతమని అర్థం.  అంటే పవిత్రమైన వ్రతాన్నే తిరుప్పావై అంటారు.  తమిళనాడులో.. దీన్ని మార్గళి అంటారు.. మీరు మార్గళి ఫెస్టివల్ వినే ఉంటారుగా.. వినకపోతే.. మార్గళి ఫెస్టివల్ గొప్పతనాన్ని.. నెట్ లో వీడియోల రూపంలో ఉంటాయి చూడండి.. కల్చరల్ గా, లిటరేచర్ పరంగా.. మార్గళి ఫెస్టివల్ చాలా గొప్పగా ఉంటుంది.

ఫంక్షన్లుండవు పండుగలే ఉంటాయి..

ఈ నెలలో వివాహాలు వంటి ఫంక్షన్స్ చేయరు. ప్రతి రోజూ పండుగలాగే జరుపుకుంటారు  అంతే. ధనుర్మాసంలో ఏ శుభకార్యం చేయరాదని మన సంప్రదాయం చెబుతోంది.  ధనుర్మాసంలో.. సూర్యనమస్కారాలు వంటి చేయటం చాలా మంచిది.  నెలరోజులపాటు.. ముత్యాల ముగ్గులు వేసి.. గొబ్బెమ్మలు పెట్టే ఆచారం మన తెలుగు ప్రాంతాల్లోనూ ఉంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలకు పెళ్లిళ్లు కాకపోతే.. మంచి సంబంధాలు రావాలని.. వాళ్లు మ్యారిటల్ లైఫ్ లో సెటిల్ కావాలని.. గొబ్బెమ్మలు పెట్టి..పూజలు చేస్తారు.

తులసీ దళంతో ..

శ్రీకృష్ణుడు, వేంకటేశ్వర స్వామి.. ఇలా విష్ణు రూపాల్లోని దేవుళ్లకు..ఈనెలంతా తులసీమాలతో లేదా కనీసం తులసీ దళంతో పూజ చేస్తే..కోరిన కోర్కెలన్నీ తీరయతాయని  భక్తుల విశ్వాసం.  ఇక దేవుళ్లకు ఒక రోజు అంటే, మనకు ఒక సంవత్సరం అని అర్థం.  ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావిస్తారు.  కాబట్టి.. దక్షిణాయనం ముగిసే చివరి రోజులైన ధనుర్మాసం దేవుళ్లకు తెల్లారుజామున అన్నమాట.  బ్రహ్మీ మూర్తం కూడా.  ఈటైం.. సాత్వికమైన ఆరాధనలకు చాలా మంచి సమయం.  కాబట్టి ఆధ్యాత్మికంగా మీరు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఇది సరైన నెల.  మరీ మీకు నెల రోజులు చేసేంత టైం లేకపోతే.. శక్తి లేకపోతే.. కనీసం 15 రోజులు .. లేదా 8 రోజులైనా ధనుర్మాసం వ్రతం చేయవచ్చు.

ఐశ్వర్యం-మోక్షం కూడా..

ధనుర్మాస వ్రతం ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తుంది. మరణానంతరం మోక్షాన్ని ఇస్తుంది.  ఇహపరాలలో మనకు ఉన్నత స్థితిని ఇచ్చే ధనుర్మాసాన్ని మీరు మనసా వాచా కర్మణా పాఠించి.. విష్ణు అనుగ్రహానికి పాత్రులవ్వండి. 

ధనుర్మాసం స్పెషాలిటీ ఇదన్నమాట..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News