Mars and Rahu Conjunction 2025: గ్రహాల సైనాధ్యిపతి అయిన కుజుడు ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. అదే రాశిలో అతడు డిసెంబర్ 07 వరకు ఉంటాడు. ఈ క్రమంలో అంగారకుడు రాహుతో కలిసి ప్రమాదకరమైన అంగారక యోగాన్ని సృష్టించబోతున్నాడు. వీరిద్దరు సంయోగం వల్ల సంభవించబోతున్న విధ్వంసక యోగం మూడు రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. వీరు విద్య, ఉద్యోగ, వ్యాపారం మరియు కెరీర్ లో ఇబ్బందులను ఎదుర్కొనున్నారు. ఆ అన్ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
కుంభ రాశి
కుంభ రాశి వారికి అంగారక యోగం ఎన్నో సమస్యలను తీసుకొస్తుంది. మీ సంసార జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆఫీసులో మీ సహచరులు లేదా బాస్ తో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. మీ కెరీర్ లో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే మీకే నష్టం. పిల్లల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు.
కర్కాటక రాశి
అంగారక యోగం వల్ల కర్కాటక రాశి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఈ సమయంలో మీరు మాటలను అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్యం గురించి కేర్ తీసుకోండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గే అవకాశం ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో నష్టాలు ఉండే అవకాశం ఉంది.
Also Read: Astrology -మరో 24 గంటల్లో కోటీశ్వరులు కాబోతున్న రాశులివే.. ఇందులో మీది ఉందా?
మకర రాశి
కుజుడు-రాహు చేస్తున్న అశుభకర యోగం మకరరాశి వారిని ఇబ్బందులకు గురిచేయనుంది. ఈ సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మాటలపై అదుపు ఉంచుకోండి. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కెరీర్ లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. స్నేహితులే శత్రువులు అవుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలు ఉంటాయి. మీ ప్రతిష్ఠ దిగజారుతుంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఖచ్చితంగా నిజమైనదని చెప్పలేం. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు. ఈ కథనాన్ని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


