Mars Asta in scorpio 2025: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. నవంబర్ 06, గురువారం నాడు అంగారకుడు తన స్వంత రాశిలో అస్తమించాడు. కుజుడు యెుక్క ఈ మార్పు కొందరి జీవితాల్లో చీకట్లను నింపింది. వారు ఎన్నో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనున్నారు. కుజుడు అస్తమయం ఏ రాశులవారిపై ప్రతికూల ప్రభావం పడనుందో తెలుసుకుందాం.
మేష రాశి
అంగారక గ్రహం అస్తమించడం మేషరాశి వారిని ఎన్నో ఇబ్బందులను గురి చేయనుంది. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తుతాయి. మానసిక ఒత్తిడికి గురవుతారు. వ్యాపారులు నష్టపోతారు. కెరీర్ లో అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగంలో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. జాబ్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు.
మిథున రాశి
మిథున రాశి వారికి కుజుడు అస్తమయం కలిసి రాదు. మీరు కెరీర్ లో ముందుకు వెళ్లడానికి మరింత కష్టపడాల్సి రావచ్చు. వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కోర్టు కేసుల్లో ఓడిపోయే అవకాశం ఉంది. మిమ్మల్ని మీ ప్రత్యర్థులు ఇబ్బంది పెడతారు. వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి. కష్టానికి తగిన గుర్తింపు లభించదు. లక్ అస్సలు ఉండదు. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది.
Also read: Amavasya 2025 – ఈ ఏడాది మార్గశిర అమావాస్య ఎప్పుడు? ఈరోజున శ్రీమహావిష్ణువును ఎందుకు పూజిస్తారు?
మీన రాశి
అంగారకుడి అస్తమయం మీనరాశి వారికి సమస్యలను సృష్టిస్తుంది. పనిలో అదృష్టం ఉండదు. కుటుంబంలో గొడవలు వస్తాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ప్రయాణాలు కలిసిరావు. కెరీర్ లో పురోగతి ఉండదు. ప్రమోషన్ కోసం మరి కొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు. మీ లవ్ ఫెయిల్ అవుతుంది. వ్యాపారులు భారీగా నష్టపోతారు. ఏ పనిలోనూ అదృష్టం ఉండదు.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం ఖచ్చితంగా నిజమని చెప్పలేం. దీనిని పండితుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇవ్వడమైనది. ఈ వార్తకు ఎలాంటి శాస్త్రీయత లేదు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


