Mangal Gochar 2025: గ్రహాల సంచారం, ఆధ్యాత్మికత పరంగా సెప్టెంబరు నెల ముఖ్యమైనది. గ్రహాల కమాండర్ గా పిలువబడే కుజుడు వచ్చే నెలలో మూడుసార్లు తన గమనాన్ని మార్చబోతున్నారు. పంచాంగం ప్రకారం, 23 సెప్టెంబర్ 2025న రాత్రి 9:08 గంటలకు అంగారకుడు రాహువు నక్షత్రమైన స్వాతి నక్షత్ర ప్రవేశం చేయనున్నాడు. అనంతరం కుజుడు తులా, కన్యా రాశుల్లో సంచరించనున్నాడు. ధైర్యానికి కారకుడిగా పిలువబడే కుజ సంచారం వల్ల ఏయే రాశులకు ప్రయోజనం చేకూరనుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు సంచారం వల్ల కర్కాటక రాశివారు ఊహించని బెనిఫిట్స్ ను పొందబోతున్నారు. మీ కెరీర్ లో ఉన్న ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి. నలుగురికి ఆదర్శపాయంగా నిలుస్తారు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు భారీగా లాభాలను ఇస్తాయి. యువతకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను గడిస్తారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి కుజుడు సంచారం సూపర్ గా ఉండబోతుంది. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారవేత్తలకు వారి పార్టనర్స్ తో మంచి సంబంధాలు ఉంటాయి. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. కెరీర్ దూసుకుపోతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృష్టం ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుంది. ఉద్యోగ సమస్యలు తీరిపోతాయి. వృత్తి జీవితం బాగుంటుంది.
Also Read: Shukra Gochar 2025 – ఆగస్టు 23న శుక్రుడు అద్భుతం.. ఈ 5 రాశులకు సుడి తిరగడం ఖాయం..
వృషభ రాశి
కుజుడి సంచారం వృషభరాశి వ్యక్తుల్లో ధైర్యంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కుజుడు ప్రభావం విద్యార్థులపై అధికంగా ఉండబోతుంది. వీరు మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు నష్టాల నుండి బయటపడతారు. అంతేకాకుండా బిజినెస్ ను విస్తరిస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.
Also read: Ketu Planet- ఆ 4 రాశులను కోటీశ్వరులను చేయనున్న కీడు గ్రహం.. ఇందులో మీది ఉందా?
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను ఇవ్వడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


