Mars Nakshatra transit 2025: వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజుడును గ్రహాల సైన్యాధిపతిగా భావిస్తారు. అంగారకుడు నెలకొకసారి రాశిని లేదా నక్షత్రాన్ని మారుస్తాడు. రేపు అంటే అక్టోబర్ 13న స్వాతి నక్షత్రం నుండి విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ధైర్యానికి కారణమైన కుజుడు నక్షత్ర సంచారం మూడు రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకురాబోతుంది. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి అంగారకుడి నక్షత్ర మార్పు మంచి ఫలితాలను ఇస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది. ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి కోరిక నెరవేరుతోంది. ఆగిపోయిన పనులు కంప్లీట్ అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదృష్టం మీకు ప్రతి పనిలోనూ ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు ఇప్పుడు మీ చేతికి అందుతుంది. కెరీర్ లో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు.
మేష రాశి
కుజ గ్రహం నక్షత్ర సంచారం మేష రాశి వారికి మేలు చేస్తుంది. మీరు చేపట్టిన ప్రతి ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మీ కెరీర్ లో అనుకోని పురోగతి ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. లక్ కలిసి వస్తుంది. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు.
Also Read: Sun Transit 2025-ఏకాదశి నాడు సూర్యుడు ఆగమనం.. ఈ 2 రాశులకు లక్ష్మీదేవి కటాక్షం..
సింహ రాశి
కుజుడు నక్షత్ర సంచారం సింహరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీరు భారీగా ధనార్జన చేస్తారు. బిజినెస్ చేసేవారు మంచి లాభాలను గడిస్తారు. అప్పుల భారం నుండి విముక్తి పొందుతారు. విదేశీ ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఇంటా బయట మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. సంసార జీవితం సాఫీగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. నలుగురిలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన వార్త పూర్తిగా నిజమైనదని మేము ఖచ్చితంగా చెప్పలేము. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా దీనిని రూపొందించడం జరిగింది. ఈ కథనానికి ఎలాంటి శాస్త్రీయత లేదు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


