Mars Saturn And Ketu Conjunction 2025: జ్యోతిష్యశాస్త్ర పరంగా కొన్ని గ్రహాలను దుష్టగ్రహాలు, కీడు గ్రహాలుగా పరిగణిస్తారు. ముఖ్యంగా రాహు, కేతు, శని గ్రహాలు ఈ కోవకే చెందుతాయి. వీటి గమనంలో ప్రజలందరి జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. మీ జాతకచక్రంలో ఈ గ్రహాలు నీచ స్థితిలో ఉంటే మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది.
మరో మూడు రోజుల్లో అంటే జూన్ 30న సింహరాశిలో దుష్టగ్రహాలైన శని, కేతువులతోపాటు కుజుడు కూడా కలవబోతున్నాడు. ఈ మూడు గ్రహాల సంయోగం మేషరాశి, సింహరాశి, కన్యారాశులవారిపై చెడు ప్రభావాన్ని చూపబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ ప్రభావం నెలరోజులపాటు ఉంటుంది. దీంతో ఈ సమయంలో వీరు ఏ కార్యం తలపెట్టినా అందులో వారు విజయం సాధించలేరు. అంతేకాకుండా అనేక సమస్యలు వారిని చుట్టుముట్టనున్నాయి. కెరీర్ లో కూడా అనేక అడ్డంకులు వస్తాయి. మీ లక్ష్యాన్ని సాధించాలంటే కొంతకాలం వేచిచూడాల్సి రావచ్చు.
సింహరాశి
ఇదే రాశిలోనే కుజుడు, శని, కేతువు కలవబోతున్నారు. ఈ త్రిగ్రహ యోగం సింహరాశి వారికి అశుభకరంగా ఉంటుంది. వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దంపతుల మధ్య గొడవలు వస్తాయి. సంతానం కోసం మరింత కాలం వేచి చూడాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు పెరుగుతాయి. కెరీర్ లో ఒడిదొడుకులను ఎదుర్కోంటారు. వ్యాపారులు నష్టపోతారు.
మేష రాశి
శని, కేతువు, కుజు గ్రహాల సంయోగం కారణంగా మేషరాశి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు ఉంటాయి. ధనార్జన పెద్దగా ఉండదు. దుబారా ఎక్కువ చేస్తారు. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. బంధువులు మిమ్మల్ని చులకనగా చూస్తారు. మీ ప్రతిష్ట దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య గొడవలు ఎక్కువ అవుతాయి. ఆర్థిక సమస్యలను ఎదుర్కోంటారు. పెళ్లి సంబంధం చెడిపోయే అవకాశం ఉంది.
కన్యా రాశి
జూన్ 30న ఏర్పడే త్రిగ్రాహి యోగం వల్ల కన్యారాశి వారు పడరానిపాట్లు పడతారు. వీరు అప్పుల ఊబిలో కూరుకుపోతారు. మానసిక రుగ్మతల బారిన పడే అవకాశం ఉంది. మీ కెరీర్ కు సంబంధించిన చెడు వార్త వింటారు. ఏ పని సజావుగా జరగదు. ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. జీవితభాగస్వాముల మధ్య వివాదాలు వస్తాయి. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.