Mars Transit in Tula Rashi 2025 effect: కుజుడు కన్యా రాశిని విడిచిపెట్టి తులారాశి ప్రవేశం చేశాడు. ఇది సెప్టెంబరు 13న రాత్రి 9:34కు జరిగింది. అక్టోబరు 26 వరకు అంగారకుడు అదే రాశిలో సంచరిస్తాడు. శౌర్యపరాక్రమాలకు కారకుడైన కుజుడు సంచారం కొందరికి అనుకూలంగా ఉంటే..మరికొందరికి ప్రతికూలంగా ఉంటుంది. అయితే తాజా సంచార సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
తులారాశి
ఇదే రాశిలోకి కుజుడు వెళ్లాడు. దీంతో ఈ రాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చు. చేపట్టిన పని మధ్యలోనే ఆగిపోతుంది. ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. బిజినెస్ చేసేవారు భారీగా నష్టపోతారు. భార్యభర్తల మధ్య ప్రేమ తగ్గుతుంది. చిన్న చిన్న వాటికి వాగ్వాదం చేసుకుంటారు. కెరీర్ లో ఆడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థికంగా మీ పరిస్థితి దిగజారుతుంది. ‘ఓం మంగళాయ నమ:’ అనే మంత్రాన్ని జపించడం వల్ల మేలు జరుగుతుంది.
మకరరాశి
కుజుడు రాశి మార్పు మకరరాశి వారికి సమస్యలను తీసుకువస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. అప్పుల బారిన పడతారు. కుటుంబంలో కలతలు వస్తాయి. సంసార జీవితం సాఫీగా సాగదు. కెరీర్ లో అనుకోని సమస్యలు రావచ్చు. వ్యక్తిగత జీవితం బాగుండదు. మంగళవారం నాడు పారే నీళ్లలో రాగి నాణేన్ని వేయడం వల్ల మంచి జరుగుతుంది.
మేషరాశి
తులరాశిలో కుజుడు సంచారం వల్ల మేషరాశి వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుంది. ఒత్తిడికి గురవుతారు. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. భార్యభర్తల మధ్య వివాదం చెలరేగుతుంది. కెరీర్ లో ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు రావచ్చు. మిమ్మల్ని ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీ లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. నిరుద్యోగులు మరికొంత కాలం జాబ్ కోసం ఎదురుచూడాల్సి రావచ్చు. దీనికి పరిహారంగా మేషరాశి వారు మంగళవారం నాడు ఎర్ర పప్పును దానం చేయడం ఉత్తమం. దీంతో హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
Also Read: Navagraha Pooja-నవగ్రహాలను పూజించడం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా?
కర్కాటక రాశి
అంగారక సంచారం వల్ల కర్కాటక రాశి వారి ఆరోగ్యం క్షీణిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు మెుదలవుతాయి. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. సన్నిహితులతో గొడవలు జరుగుతాయి. మీరు మానసికంగా ఇబ్బందులను ఎదుర్కోనే అవకాశం ఉంది. పెళ్లి కోసం మరికొంత కాలం ఆగాల్సి రావచ్చు. ఈ రాశి వారు మంగళవారం నాడు బెల్లం, గోధుమలను దానం చేయడం మంచిది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు. కేవలం పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా దీనిని ఇవ్వడమైనది. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


