Mars Transit in December 2025: ఆస్ట్రాలజీలో అంగారకుడిని ధైర్యానికి మరియు కోపానికి కారకుడిగా భావిస్తారు. అందువల్ల కుజుడు కదలికలో మార్పు మెుత్తం 12 రాశులవారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న కుజుడు డిసెంబరు 28న ధనస్సు రాశి ప్రవేశం చేయనున్నాడు. బృహస్పతి రాశిలో అంగారకుడి సంచారం మూడు రాశుల వారికి బంఫర్ బెనిపిట్స్ ను అందించబోతుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
ధనస్సు రాశి
ఇదే రాశిలో కుజుడు వెళ్లబోతున్నాడు. దీంతో వీరి ధైర్యసాహసాలు పెరుగుతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సంపద ఊహించని రేంజ్ లో పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా స్థిరత్వం సాధిస్తారు. మీకు ప్రతి పనిలో లైఫ్ పార్టనర్ సపోర్టు ఉంటుంది. సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉద్యోగం దొరికే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
కుజుడు సంచారం వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. పోటీపరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పెద్ద పొజిషన్ లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది.
Also Read: Powerful Rajyog -5 ఏళ్ల తర్వాత తులా రాశిలో పవర్ పుల్ రాజయోగం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..
సింహరాశి
సింహరాశి వారికి అంగారకుడి సంచారం అద్భుతంగా ఉండబోతుంది. మీరు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మంచి లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనార్జన ఉంటుంది. ఫ్యామిలీ సపోర్టు దొరుకుతుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్త వింటారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు మీ వద్దకు తిరిగి వస్తుంది.


