Mars transit in July 2025: జూలైలో కీలక గ్రహసంచారాలు జరగబోతున్నాయి. అందులో కుజుడు రాశి మార్పు ఒకటి. రెడ్ ప్లానెట్ పిలువబడిన అంగారకుడు ఈ నెల 28న కన్యా రాశిలోకి ప్రవేశించనున్నారు. దీంతో కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. కుజ సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
మకర రాశి
కుజుడు రాశి మార్పు మకరరాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. జూలైలో మీ దశ తిరగబోతుంది.కుటుంబ సభ్యుల మధ్య సంతోషకర వాతవారణం ఉంటుంది. మీ కోర్టు వ్యవహారాలు చక్కబడతాయి. అనారోగ్యం నుంచి బయటపడతారు. సమయానికి మీ పనులు పూర్తవుతాయి. మీరు కెరీర్ లో చాలా ఎత్తుకు ఎదుగుతారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. మీ బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. బంధువుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీకు అదృష్టం కలిసి వస్తుంది.
సింహ రాశి
అంగారకుడి సంచారం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మీ ఇంట బయటా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ వ్యక్తిత్వం, ప్రతిభతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. విద్యార్థులకు ఈ టైం కలిసి వస్తుంది. మీకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగస్తుల జీతభత్యాల పెరగడంతోపాటు ప్రమోషన్ కు అవకాశం ఉంది. మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి.
వృశ్చిక రాశి
కుజ సంచారం వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీకు ప్రతి పనిలో మంచి ఫలితాలు పొందుతారు. అప్పులు తీరిపోయి డబ్బును పొదుపు చేస్తారు. విద్యార్థులకు, ఉద్యోగులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులు ఊహించని లాభాలు ఉంటాయి. మీరు పేదరికం నుండి విముక్తి పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోయి సంతోషంగా గడుపుతారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.


