Mars Transit in Sagittarius 2025: వేద జ్యోతిష్యశాస్త్రంలో అంగారక గ్రహాన్ని దైర్యం, శౌర్యం మరియు సంపదలకు కారకుడిగా భావిస్తారు. అలాంటి కుజుడు తన రాశిని మార్చినప్పుడల్లా దాని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. ప్రస్తుతం తన సొంత రాశిలో సంచరిస్తున్న కుజుడు వచ్చే నెలలో ధనుస్సు రాశి ప్రవేశం చేయనున్నాడు. ధనుస్సు రాశిలో అంగారకుడు సంచారం వల్ల మూడు రాశులవారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఆ ఆదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
మేష రాశి
అంగారకుడు సంచారం మేషరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఆర్థికంగా బలపడతారు. అదృష్టంతోపాటు ఐశ్వర్యం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కుటుంబంలో ఆనందంతోపాటు శాంతి ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. బిజినెస్ చేసేవారు బారీగా ప్రాఫిట్స్ ను పొందుతారు. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు ఎన్నో రెట్లు లాభాలను ఇస్తాయి. చదువు లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతోంది.
వృశ్చిక రాశి
కుజుడు సంచారం వృశ్చిక రాశివారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఏర్పడతాయి. మీ లక్ తెరుచుకుంటుంది. నచ్చిన వ్యక్తితో వివాహం కుదిరే అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. సంతానప్రాప్తికి అవకాశం ఉంది. మీ ప్రేమ ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కొత్త కొత్త స్కిల్స్ అలవరుచుకుంటారు, ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: Astrology -500 ఏళ్ల తర్వాత ఒకే స్థితిలో శని, బుధుడు.. ఈ 3 రాశులకు జాక్ పాట్ పక్కా..
మీన రాశి
మీన రాశి వారికి అంగారకుడు సంచారం అద్భుతంగా ఉండబోతుంది. మీరు చేపట్టే ప్రతి ప్రాజెక్టు సక్సెస్ పుల్ అవుతుంది. వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు ఒక్కసారిగా పెరుగుతాయి. విద్యార్థులు చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటారు. కోరుకున్న వ్యక్తితోనే మీ పెళ్లి కుదురుతుంది. ప్రతి పనిలో అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. కెరీర్ లో మంచి పురోగతి లభిస్తుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. రియల్ ఎస్టేట్, విద్య మరియు వైద్య రంగాల్లో ఉన్నవారు లాభపడతారు.

