Saturday, November 15, 2025
HomeదైవంRajyog: కేంద్ర రాజయోగంతో నక్కతోక తొక్కబోతున్న మూడు రాశులు.. మీది ఉందా?

Rajyog: కేంద్ర రాజయోగంతో నక్కతోక తొక్కబోతున్న మూడు రాశులు.. మీది ఉందా?

Kendra Trikon Rajyog 2025 effect: ఆస్ట్రాలజీలో అంగారకుడిని గ్రహాల సైన్యాధిపతిగా భావిస్తారు. ఇతడిని ధైర్యం, ఆత్మవిశ్వాసం, భూమి మెుదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. ఇటీవల కుజుడు తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలో ప్రవేశించాడు. ఈ క్రమంలో ఇతడు పంచమహాపురుష రాజయోగాల్లో ఒకటైన కేంద్ర త్రికోణ రాజయోగాన్ని సృష్టించబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారి తలరాత మారబోతుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.

- Advertisement -

మేష రాశి
కేంద్ర త్రికోణ రాజయోగం మేషరాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. మీరు ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంజినీరింగ్, మెడికల్, టెక్నాలజీ, రీసెర్చ్ రంగాల్లో ఉన్న లాభపడతారు. కోల్పోయిన డబ్బు మీ చెంతకు చేరుతుంది.

కర్కాటక రాశి
కుజుడు సృష్టించబోతున్న కేంద్ర రాజయోగం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక ఫలిస్తుంది. సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. మీరు చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. పాలిటిక్స్ లో ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

Also Read: Grah yuti -వృశ్చిక రాశిలో మూడు గ్రహాల కలయిక.. నవంబరులో ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..

సింహ రాశి
కేంద్ర త్రికోణ రాజయోగం సింహరాశి వారికి ప్రత్యేకంగా ఉండబోతుంది. వీరి కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. మీకు పని చేసే చోట ప్రశంసలు లభిస్తాయి. మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. ఆర్థికంగా బలమైన స్థితిలో ఉంటారు. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ కోరికలు సకాలంలో నెరవేరుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad