Mars nakshatra Transit Effect On Zodiac Signs: గ్రహాలు కాలానుగుణంగా రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. రెడ్ ప్లానెట్ గా పిలువబడే కుజుడు ఈ నెల 23న కుజుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి వెళ్లబోతున్నాడు. దీంతో కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. అంగారకుడి సంచారం ఏయే రాశులవారికి లాభించనుందో తెలుసుకుందాం.
సింహ రాశి
అంగారకుడి నక్షత్ర మార్పు సింహరాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీ సంపాదన అనేక రెట్లు పెరగబోతుంది. మీ ఆర్థిక పరిస్థితులు మారుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అపాయ్యతలు పెరుగుతాయి. మీరు కోరుకున్న వ్యక్తితోనే వివాహం కుదురుతుంది. ఎల్లప్పుడు లక్ మీ వెంటే ఉంటుంది. మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. మీ కష్టాలన్నీ మటుమాయమవుతాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం రానే వస్తుంది. బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. కెరీర్ లో ఎన్నడూ ఊహించని పురోగతి ఉంటుంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది.
తులా రాశి
కుజ గ్రహ సంచారం తులరాశి వారికి ఎన్నో విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని అనుకోని అదృష్టం వరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. మీ కెరీర్ లో మలుపు ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. నిరుద్యోగులకు జాబ్ దొరుకుతుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. డబ్బు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతుంది. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. లక్ ఎల్లప్పుడు మీ వెంటే ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుజుడు నక్షత్ర సంచారం అద్భుతంగా ఉండబోతుంది. కుజుడు అనుగ్రహంతో మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు ఆర్థికంగా ఎదుగుతారు. వ్యాపారస్తులు మరిన్ని లాభాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం ఇంతకముందు కంటే మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. మీ కృషికి తగిన ప్రతిఫలం దొరుకుంది. మీరు ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తట్టుకోని నిలబడతారు. పెళ్లికాని ప్రసాదులకు వివాహాయోగం ఉంది.


