Mars Transit 2025 in Scorpio: ప్రతి గ్రహం నిర్ణీత సమయం తర్వాత తన రాశిచక్రాన్ని మారుస్తుంది. గ్రహాల కమాండరైన అంగారకుడు కూడా అక్టోబర్ 27న తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ క్రమంలో కుజుడు రుచక్, హంసమహాపురుష వంటి రాజయోగాలను ఏర్పరచబోతున్నాడు. వృశ్చిక రాశిలో కుజుడు సంచారం వల్ల మూడు రాశులవారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
కుంభ రాశి
కుజుడు సంచారం కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. పెట్టుబడులు లాభిస్తాయి. కెరీర్ లో అనుకోని పురోగతి ఉంటుంది. ఫ్యామిలీ సపోర్టుతో ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనార్జన చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
మిథునరాశి
అంగారక సంచార మిథునరాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. మీ కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. కెరీర్ లో ఊహించని పురోగతి ఉంటుంది. మీ లీడర్ షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంసార జీవితం సాఫీగా ఉంటుంది.
Also Read: Astrology -12 ఏళ్ల తర్వాత పవర్ పుల్ రాజయోగం.. ఈ 3 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..
సింహరాశి
వృశ్చిక రాశిలో కుజుడు సంచారం సింహరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. మీ ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయి. ఆఫీసులో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి.
Disclaimer: ఇక్కడ ఇచ్చిన కథనం పూర్తిగా నిజమని చెప్పలేం. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


