Mangal gochar in October 2025: గ్రహాల సైన్యాధిపతి అయిన కుజుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. ఈ నెల 27న వృశ్చిక రాశిలోకి ప్రవేశించి.. డిసెంబరు వరకు అదే రాశిలో ఉండనున్నాడు. వృశ్చిక రాశిలో అంగారకుడు సంచారం వల్ల మూడు రాశులవారి అదృష్టం మారబోతుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఇదే రాశిలో కుజుడు సంచరించబోతున్నాడు. దీంతో వృశ్చిక రాశి వ్యక్తుల యెుక్క ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా ఇదే అనుకూల సమయం. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యభర్తలు మంచి సమయం గడుపుతారు. మీ లవ్ సక్సెస్ అవుతోంది.
సింహరాశి
సింహరాశి యెుక్క నాల్గో ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. భారీగా స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఇప్పుడు కంప్లీట్ అవుతాయి. వ్యాపారం చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
Also Read: Diwali 2025-దీపావళి నాడు పవర్ పుల్ యోగం.. ఈ 3 రాశులవారు నక్కతోక తొక్కినట్లే..
మీనరాశి
అంగారకుడు సంచారం మీనరాశి వారి అదృష్టం మారబోతుంది. మీరు పని చేసే చోట ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక ఫలిస్తుంది. ఆగిపోయిన పనులు కంప్లీట్ అవుతాయి. సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. ప్రతి పనిలో లక్ కలిస వస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం ఖచ్చితంగా నిజమైనదని మేము చెప్పలేం. పాఠకుల ఆసక్తి మేరకు దీనిని ఇవ్వడమైనది. తెలుగు ప్రభ ఈ వార్తను ధృవీకరించలేదు.


