Astrology Vs Dream Interpretation: సాధారణంగా మనం రాత్రి నిద్రలో కొన్ని కలలు కంటుంటాము. సైన్స్ ప్రకారం కలలు మన ఆలోచనలు, భావాల వల్ల కలుగుతాయి. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక ప్రతిబింబం ఉంటుందని చెబుతారు. స్వప్న శాస్త్రం కలల గురించి వాటి అర్థాల గురించి వివరిస్తుంది. అలాగే అవి శుభమా లేదా అశుభమా అని కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా వచ్చే కలల బట్టి మన శారీరక ఆరోగ్యం,కర్మ ఫలితాలు కూడా తెలుసుకోవచ్చు. అయితే ఏలాంటి కలలకు మనకు శభమైనవి? దానికి గల కారణాల గురించి తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రం ప్రకారం కలలు మనం కలగలిగే సమయం మీద ఆధారపడి ఉంటుందని చెతుబుంది. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే వెంటనే కలలు వస్తే అది సాధారణమైనవి. ఈ కలలు కేవలం మన ఆలోచనలు అని స్వప్న శాస్త్రం చెబుతుంది. అర్ఠరాత్రి 12 నుంచి 2 గంటల మధ్య వచ్చే కలలకు ప్రాముఖ్యత ఉంటుంది కానీ అవి నిజం కాకపోవచ్చు అని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అయితే తెల్లవారుజామున అంటే 3 గంటల నుంచి ఉదయం వరకు వచ్చే కలలు మాత్రం తరచుగా జరుగుతాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఈ కలలకు అత్యధిక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఆ వచ్చే కలలకు జ్యోతిష్య కారణాలు, అర్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
మీ కలలో సముద్రం కనిపిస్తే పెద్ద లక్ష్యాలు, అవకాశాలు వస్తున్నాయని అర్థం. కొన్నిసార్లు తీవ్రమైన భావోద్వేగాలకు గురైతారు అని సూచిస్తుంది.
బురద నీరు కనిపిస్తే ఆశుభాన్ని సూచిస్తుంది. ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు కలుగుతాయని స్వప్న జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అదే మీ కలలో స్వచ్ఛమైన నీరు కనిపిస్తే మాత్రం ఆనందం, మానసిక ప్రశాంతత, శుభ ఫలితాలు కలుగుతాయి.
కొన్నిసార్లు నదిలో ఈత కొడుతున్నట్లు కలలు వస్తే మీరు దూర ప్రయాణాలు చేస్తారని లేదా జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని సూచించినట్లు.
కొన్నిసార్లు కలలో జంతువులు కూడా కనిపిస్తాయి. అందులో తరచుగా పాము కనిపించడం సహజం. పాము కలలోకి వస్తే మీరు ప్రమాదంలో ఉన్నారని లేదా మీ చుట్టూ శత్రువులు ఉన్నారని సూచిస్తుంది.
కొన్నిసార్లు పాము వెంటపటం వంటి కలలు వస్తాయి దీనికి అర్థం మీరు భయం, ఆందోళనతో బాధపడుతారని సూచిన.
అదే మీ కలలోకి నాగుపాము వస్తే మీకు పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయని సూచిస్తుంది.
సింహం మీ కలలో కనిపిస్తే నాయకత్వం, ధైర్యం కలుగుతుంది. ఆవు కలలో కనిపిస్తే పవిత్రత, సంతాన ప్రాప్తికి చిహ్నం.
ఏనుగు ఐశ్వర్యానికి చిహ్నం మీ కలలో ఏనుగు కనిపిస్తే ఇది మంచి శకునం.
చివరిగా స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే మన కలలు మన భవిష్యత్ గురించి సూచనలు ఇవ్వగలవుని వాటిపైన దృష్టి పెటాలని సూచిస్తున్నాయి. అయితే ఈ కలలు వాటి ఆర్థాలు కేవలం జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది.


