HomeదైవంAstrology: 18 ఏళ్ల తర్వాత శక్తివంతమైన యోగం.. ఈ 3 రాశుల సుడి తిరగడం ఖాయం..

Astrology: 18 ఏళ్ల తర్వాత శక్తివంతమైన యోగం.. ఈ 3 రాశుల సుడి తిరగడం ఖాయం..

Vipreet Rajyog in November 2025: గ్రహాలు యువరాజైన బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటికే అదే రాశిలో కుజుడు కూడా ఉన్నాడు. ఇటీవల స్కార్పియోలో బుధుడు అస్తమించాడు. నవంబర్ 27 వరకు అదే స్థితిలో ఉండబోతున్నాడు. ఈ క్రమంలో కుజుడు, బుధుడు కలిసి అరుదైన విపరీత లేదా వ్యతిరేక రాజయోగాన్ని సృష్టించబోతున్నాడు. ఈ యోగం వల్ల మూడు రాశుల వారి అదృష్టం పండబోతుంది. ఆ రాశిచక్రాలు ఏవో ఓ లుక్కేద్దాం.

- Advertisement -

కన్యా రాశి
విపరీత రాజయోగం కన్యా రాశి వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందడంతోపాటు విస్తరిస్తుంది కూడా. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తారు. మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమయ్యే యాస్పిరెంట్స్ విజయం సాధిస్తారు. ఆర్థికంగా మీరు మంచి స్థితిలో ఉంటారు. మీ అభిప్రాయాలను నిర్భయంగా పంచుకోగలుగుతారు.

మేష రాశి
బుధుడు మరియు కుజుడు సృష్టించబోతున్న వ్యతిరేక రాజయోగం మేషరాశి వారికి కలిసి వస్తుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. భార్యభర్తల మధ్య గొడవలు సద్దుమణుగుతాయి. కెరీర్ లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. గర్వాన్ని తగ్గించుకుంటే మంచిది. మీ డ్రీమ్స్ నెరవేరుతాయి. లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. క్రిస్మస్ కు ముందు లక్ కలిసి వస్తుంది.

Also read: 2026 Grahan list-వచ్చే ఏడాది నాలుగు గ్రహణాలు.. తేదీలు ఇవే..!

ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి రివర్స్ రాజయోగం మంచి ఫలితాలను ఇస్తుంది. సమాజంలో మీ గౌరవం, హోదా పెరుగుతాయి. ప్రస్తుతం జాబ్ చేస్తున్న వారు మారడానికి ఇదే మంచి తరుణం. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలన్నా, విస్తరించాలన్నా ఇదే సరైన సమయం. లైఫ్ లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీ ఫ్రెండ్స్ తో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఉపాధి లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది. హెల్త్ బాగుంటుంది. మీ కష్టానికి తగిన పేరు లభిస్తుంది.

Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం ఖచ్చితంగా నిజమైనదని చెప్పలేం. ఈ వార్తకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని కేవలం పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వడమైనది. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News