Navpancham rajyog effect: గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మార్చడం ద్వారా ఇతర ఫ్లానెట్స్ తో కలిసి శుభ మరియు అశుభయోగాలను ఏర్పరుస్తాయి. అక్టోబర్ 29న బుధుడు మరియు నెప్ట్యూన్ గ్రహాలు ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో ఖండించుకోవడం వల్ల నవపంచమ యోగం సృష్టించబడింది. వృశ్చిక రాశిలో బుధుడు, మీనరాశిలో నెప్ట్యూన్ గ్రహం కూర్చోవడం వల్ల ఈ అరుదైన యోగం ఏర్పడుతుంది. 14 ఏళ్ల తర్వాత ఇది సంభవించబోతుంది. ఈ యోగ ప్రభావం వల్ల మూడు రాశులవారి అదృష్టం మారబోతుంది.
సింహరాశి
బుధుడు మరియు వరుణుడు చేస్తున్న నవపంచమ రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ధైర్యంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు మళ్లీ స్టార్ట్ అవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. కొత్త మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మీ సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ స్కిల్స్ పెరుగుతాయి.
వృషభ రాశి
నవపంచమ రాజయోగం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు వచ్చి పడుతుంది. పెట్టుబడులు ఊహించని లాభాలను ఇస్తాయి. ఉద్యోగంలో జీతంతోపాటు పదోన్నతి లభిస్తుంది. మీ బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Ekadashi 2025 -దేవుత్తని ఏకాదశి నాడు అరుదైన యోగం.. ఈ 3 రాశులకు శ్రీమహావిష్ణువు కటాక్షం..
మేష రాశి
సింహరాశి వారికి నవపంచమ రాజయోగం చాలా బాగుంటుంది. ఈ వ్యక్తులకు మంచి రోజులు రాబోతున్నాయి. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. లైఫ్ పార్టనర్ తోపాటు ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. గత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి.

