Mercury and Rahu Conjunction 2026 in Kumbh Rasi: గ్రహాల గమనం ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాల యువరాజైనా బుధుడు ఫిబ్రవరి 3, 2026న రాత్రి 9:37 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. రాహువు కూడా అదే సమయంలో కుంభరాశిలో ఉంటాడు. వీరిద్దరి కలయిక వల్ల అరుదైన యుక్త యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం కారణంగా కొందరికి మంచి రోజులు రాబోతున్నాయి.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి యెుక్క మూడో ఇంట్లో యుక్త యోగం సంభవించబోతుంది. దీంతో వీరికి డబ్బుకు కొదవ ఉండదు. ఈ వ్యక్తులు పట్టిందల్లా బంగారం అవుతుంది. పెళ్లి కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ మరియు వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు వేసుకున్న ఫ్లాన్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. వచ్చే సంవత్సరం మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
వృషభ రాశి
ఈ రాశి యెుక్క పదో ఇంట్లో బుధుడు-రాహువు కలయిక జరగబోతుంది. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందబోతున్నారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఊహించని లాభాలను ఇస్తాయి. భారీగా స్థిరచరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీ కెరీర్ లో కీలక మలుపు ఉంటుంది. ఇతరులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులు ఇంతకుముందు కంటే ఎక్కువ లాభాలను చూస్తారు.
Also Read: Shukra Gochar 2025 – నాగుల చవితి తర్వాత చిత్త నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులకు బంపర్ జాక్ పాట్..
మకర రాశి
బుధుడు మరియు రాహువు యెుక్క సంయోగం మకరరాశి వారి జాతకాన్ని మార్చబోతుంది. మీ దాంపత్య జీవితంలో శాంతి, సంతోషం వెల్లివిరుస్తుంది. అప్పులు తీరుస్తారు. వ్యాపారంలో ఊహించని లాభం పొందుతారు. కోర్టు వివాదాలు పరిష్కారమవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బును భారీగా పొదుపు చేస్తారు. మీ కెరీర్ లో విజయం లభిస్తుంది. అదృష్టంతోపాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఖచ్చితంగా నిజమైనదని చెప్పలేం. ఈ వార్తకు ఎలాంటి శాస్త్రీయత లేదు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


