Mercury and Saturn Conjunction 2025: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో కలిసి శుభ,అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. గ్రహాల యువరాజైన బుధుడు, న్యాయదేవుడైన శనిదేవుడు నిన్న రాత్రి సంయోగం చెందారు. వీరిద్దరి కలయిక ద్వాదశ రాశులవారిపై ప్రభావం చూపిస్తుంది. బుధుడు, శని సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
మిథునరాశి
బుధుడు, శని కలయిక మిథునరాశి వారి ఫేట్ ను మార్చబోతుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ దూరమవుతాయి. వ్యాపారంలో ఊహించని లాభాలను చూస్తారు. పనిలో ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉంటారు. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. సంసారం జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఎన్నో ఏళ్లు గా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది.
మకర రాశి
గ్రహాల సంచారం వల్ల మకర రాశి వారి జీవితంలో ఊహించని మలుపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. నచ్చిన లైఫ్ పార్టనర్ లభిస్తుంది. ప్రేమికులు మంచి సమయం గడుపుతారు. ఉద్యోగులకు బోనస్ తోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉంటుంది. బిజినెస్ లో లాభాలు రావడంతోపాటు మరిన్ని బ్రాంచ్ లు పెడతారు. సంసార జీవితంలో సఖ్యత మరింత పెరుగుతుంది. మీ లవ్ సక్సెస్ అయి అది వివాహానికి దారి తీస్తుంది.
Also Read: Solar Eclipse 2025 -సెప్టెంబరు 21న సూర్యగ్రహణం.. ఈ 4 రాశులకు దశ తిరగబోతుంది..
కన్యా రాశి
ఈ రాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటారు. మీ కెరీర్ లో ఎవ్వరూ ఊహించని గ్రోత్ ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. వ్యాపారులకు అనుకోని లాభాలు ఎదురువుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు.
Disclamier: ఇక్కడ ఇచ్చిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. రీడర్స్ ఆసక్తి దృష్ట్యా పండితుల అభిప్రాయాలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా దీనిని రూపొందించడమైనది. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.


