Mercury Retrograde-Zodiac Signs:బుధ గ్రహం జ్యోతిష్యంలో చాలా ప్రాధాన్యం ఉన్నది. ఇది మన కమ్యూనికేషన్, వ్యాపారం, నిర్ణయాలు, తెలివితేటలు వంటి అంశాలకు ప్రతీకగా పండితులు భావిస్తారు. బుధుడు తిరోగమనంలోకి వెళ్లినప్పుడు మన జీవితంలో అనుకోని సమస్యలు, అపార్థాలు, జాప్యాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జులైలో ఈ గ్రహం తిరోగమనం ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది తమ వ్యక్తిగత, వృత్తిపర జీవితంలో స్పష్టత కోల్పోయినట్లు అనుభవించి ఉండవచ్చు. పనులు ఆగిపోవడం, సంబంధాలలో అపార్థాలు రావడం, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడటం వంటివి సహజమైయ్యాయి.
సింహరాశిలో…
ఇక ఇప్పుడు మంచి సమయం వచ్చింది. సింహరాశిలో జరిగిన ఈ తిరోగమనం పూర్తయింది. దీని అర్థం ఏమిటంటే, గత కొంతకాలంగా మనసు మబ్బుగా ఉన్నవారికి ఇకపై క్లారిటీ వస్తుంది. సమస్యలు మెల్లగా తగ్గిపోతాయి. ఆగిపోయిన పనులు మళ్లీ కదలికలోకి వస్తాయి. ప్రతి రాశికి ఇది ఒక సానుకూల పరిణామమే అయినప్పటికీ, ముఖ్యంగా నాలుగు రాశులు మరింత బలంగా లాభపడతాయి. అవే వృషభం, సింహం, వృశ్చికం, కుంభం.
వృషభ రాశి
వృషభ రాశి వారు గత కొద్ది వారాలుగా కుటుంబం, ఇల్లు, భావోద్వేగాలకు సంబంధించిన అంశాలలో అయోమయం అనుభవించి ఉండవచ్చు. కొన్ని విషయాలు ముందుకు ఎలా తీసుకెళ్లాలో గందరగోళం ఏర్పడి ఉండొచ్చు. కానీ బుధుడు తిరోగమనాన్ని ముగించడంతో పరిస్థితి మారబోతోంది. వీరు భావోద్వేగంగా సురక్షితంగా అనిపించుకుంటారు. దీర్ఘకాలంగా ఆగిపోయిన ప్రణాళికలు క్రమంగా రూపుదిద్దుకుంటాయి. వ్యక్తిగత సంబంధాల్లో శాంతి పెరుగుతుంది. తాము తీసుకునే నిర్ణయాలలో స్పష్టత కనిపిస్తుంది. ఈ మార్పు వారికి మానసిక ధైర్యాన్ని పెంచుతుంది.
సింహ రాశి
సింహరాశి వారు బుధుడు తిరోగమనంలో ఉన్నప్పుడు అనేక రకాల సందేహాలు, సంబంధాల్లో చిక్కులు ఎదుర్కొని ఉండవచ్చు. వారి వ్యక్తిగత, వృత్తిపర జీవితంలో స్థిరత్వం లేకుండా అనిపించి ఉండవచ్చు. కానీ ఈ దశ పూర్తయిన తర్వాత కొత్త అవకాశాలు వీరిని చేరుకుంటాయి. ఆటుపోట్లు తగ్గి, మంచి విషయాలు వీరి దారిలోకి వస్తాయి. వీరు తమ సృజనాత్మకతను మరింతగా ప్రదర్శించే అవకాశం పొందుతారు. వ్యక్తీకరణలో ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల కొత్త విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. రాబోయే రోజులు వీరికి అదృష్టాన్ని తెస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారు గతంలో తమ వృత్తిపర జీవితంలో ఆలస్యం, నిరాశలు, అన్యాయం అనుభవించి ఉండవచ్చు. వారు కష్టపడ్డా ఫలితం రాకపోవడం వల్ల నిరుత్సాహానికి గురయ్యారు. కానీ ఇప్పుడు బుధుడు ప్రత్యక్ష గమనంలోకి రావడంతో వారి పరిస్థితి మారనుంది. వీరి లక్ష్యాలు, ఆశయాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొత్త శక్తితో ముందుకు కదులుతారు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. పదోన్నతులు, ప్రాధాన్యతలు పొందే అవకాశం పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎదురైన సవాళ్లు వీరి బలాన్ని పెంచినట్లు అనిపిస్తాయి. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు మంచి దారితీస్తాయి.
కుంభ రాశి
కుంభరాశి వారు బుధుడు తిరోగమనంలో ఉన్నప్పుడు సంబంధాలలో ఒత్తిడి, అసౌకర్యం ఎదుర్కొని ఉండవచ్చు. సమన్వయం కోసం రాజీ పడాల్సి వచ్చిన సందర్భాలు ఉండొచ్చు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో సందేహాలు కూడా కలిగివుంటాయి. ఇప్పుడు బుధుడు తిరోగమనాన్ని ముగించడంతో వీరి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. వ్యక్తిగత సంబంధాలు మెరుగవుతాయి. అదృష్టం వీరికి అనుకూలంగా మారుతుంది. వ్యాపారం, కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త పరిచయాలు, భాగస్వామ్యాలు వీరి అభివృద్ధికి దోహదపడతాయి.


