Mercury transit in October 2025: గ్రహాల యువరాజైన బుధుడు దసరా తర్వాత తన రాశిని మార్చబోతుంది. అక్టోబర్ 03 తెల్లవారుజామున 3:43 గంటలకు తులారాశిలో బుధ సంచారం జరగబోతుంది. దాదాపు 20 రోజులపాటు అదే రాశిలో మెర్క్యూరీ ఉండబోతున్నాడు. బుధుడు యెుక్క సంచారం మూడు రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
బుధుడు యెుక్క రాశి మార్పు కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉండనుంది. మీ కష్టంతోపాటు అదృష్టం కూడా కలిసి రావడంతో మీరు అనుకున్నది సాధిస్తారు. గతంలో ఇచ్చిన డబ్బును తిరిగి వస్తారు. కెరీర్ లో అనుకోని మలుపు ఉంటుంది. ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. పేదరికం నుండి బయటపడతారు. పెళ్లికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. సంసార జీవితంలో ఆనందమయం అవుతుంది. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉండటంతో ప్రమోషన్ కు అవకాశం ఉంది. వృత్తిలో విజయం సాధిస్తారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి బుధుడు సంచారం కలిసి వస్తుంది. మీ కెరీర్ లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. బిజినెస్ చేసేవారు ఊహించని లాభాలను చూస్తారు. ఉద్యోగులకు లక్ ఫ్యాక్టర్ ఉండటంతో జీతం అమాంతం పెరిగిపోతుంది. అప్పుల భారం నుండి విముక్తి లభిస్తుంది. పెళ్లికాని వారికి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పిల్లలకు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. పోటీపరీక్షలకు సిద్దమయ్యే వ్యక్తులు విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: Navratri 2025 Day 4 -విశ్వానికి వెలుగును ప్రసాదించిన దేవత కుష్మాండ దేవి.. ఆ దేవతను ఎలా పూజించాలంటే?
కుంభరాశి
మెర్క్యూరీ సంచారం కుంభరాశి వారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది. వీరికి దసరా తర్వాత మంచి రోజులు రాబోతున్నాయి. కుంభరాశి వారు ముట్టిందల్లా బంగారం కానుంది. మీ ప్రణాళికలన్నీ ఫలిస్తాయి. వివాహా యోగం ఉంది. కొత్త జంటలకు సంతానప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆ అమ్మవారి దయ కారణంగా మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. జాబ్ చేసేవారికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.


