Friday, December 12, 2025
HomeదైవంMercury Transit:తులరాశిలో బుధుడు..ఈ రాశుల వారికి గోల్డెన్‌ డేస్‌..వ్యాపారంలో దూసుకుపోతారు!

Mercury Transit:తులరాశిలో బుధుడు..ఈ రాశుల వారికి గోల్డెన్‌ డేస్‌..వ్యాపారంలో దూసుకుపోతారు!

Budh Rashi Parivartan 2025:జ్యోతిషశాస్త్రంలో బుధుడిని మేధస్సు, వాణిజ్యం, విద్య, కమ్యూనికేషన్‌లకు అధిపతిగా చెబుతుంటారు. ఈ గ్రహం సంచారం వ్యక్తుల ఆలోచన విధానం, మాట్లాడే తీరు, వ్యాపార నిర్ణయాలపై ముఖ్యమైన ప్రభావాన్ని చూపిస్తుందని పండితులు చెబుతుంటారు. అక్టోబర్ 3నబుధుడు తన స్వగ్రహమైన కన్యారాశి నుంచి బయటకు వచ్చి, శుక్రుడి ఆధీనంలో ఉన్న తులారాశిలోకి అడుగుపెట్టాడు. ఈ సంచారం అక్టోబర్ 24 వరకు కొనసాగుతుంది. అనంతరం బుధుడు వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు.

- Advertisement -

తులారాశి శుక్రుడికి…

తులారాశి శుక్రుడికి సంబంధించిన రాశి కావడంతో, బుధుడి ఈ ప్రవేశం చాలా రాశులవారికి అనుకూల పరిస్థితులను తెస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా, వృత్తి, వ్యాపారం, కమ్యూనికేషన్ రంగాల్లో బుధుడు ఇచ్చే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో కొందరికి కొత్త అవకాశాలు లభించవచ్చు, కొందరు తమ కెరీర్‌లో ముందడుగు వేయవచ్చు.

Also Read: https://teluguprabha.net/devotional-news/astrological-benefits-of-wearing-gold-for-prosperity-and-positivity/

కన్యారాశి

కన్యారాశి వారికీ బుధుడు స్వగ్రహాధిపతి కావడంతో, ఈ సంచారం ఎంతో ప్రాధాన్యత కలిగిందిగా ఉంటుంది. బుధుడు ఇప్పుడు వారి రెండవ స్థానంలో ఉన్నాడు. ఇది ఆర్థిక స్థితిని బలపరచడంలో కీలకంగా పనిచేస్తుంది. ఈ కాలంలో పనిలో చురుకుదనం పెరుగుతుంది, నిర్ణయాలు సక్రమంగా తీసుకుంటారు. ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తిలో సానుకూల మార్పులు వస్తాయి. కొంతమందికి కొత్త ఉద్యోగం లేదా ప్రాజెక్ట్ లభించే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థికంగా కూడా లాభదాయకమైన సమయం ఇది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు, పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి.

తులారాశి

బుధుడు ప్రస్తుతం ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ కారణంగా తులారాశి వారికి వ్యక్తిగత, వృత్తి, సామాజిక రంగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతం పెంపు లభించవచ్చు. వ్యాపారం చేసే వారు కొత్త ఒప్పందాలు లేదా కస్టమర్లను పొందుతారు. అదేవిధంగా ఈ కాలం దాంపత్య సంబంధాలపైనా సానుకూల ప్రభావం చూపిస్తుంది. సంబంధాల్లో సమతుల్యత ఏర్పడుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇది సరైన సమయం. బుధుడు శుక్రుడి రాశిలో ఉండడం వల్ల ఆలోచనలో స్పష్టత, నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుంది.

Also Read:https://teluguprabha.net/devotional-news/feng-shui-butterfly-paintings-bring-love-and-positive-energy/

ధనుస్సు రాశి
బుధుడి సంచారం ధనుస్సు రాశి వారికి లాభస్థానంలో ఉంది. ఇది ఆర్థిక, వృత్తి, సామాజిక సంబంధాల పరంగా మంచివార్తలను తీసుకుని వస్తుంది. ఈ కాలంలో మీరు చాలా కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారులు కొత్త లాభ మార్గాలను కనుగొంటారు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. విదేశీ సంబంధాలు ఉన్నవారికి కూడా ఈ కాలం మేలు చేస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News