Mercury Transit Libra 2025: జ్యోతిషశాస్త్రంలో ప్రతి గ్రహం మన జీవితంలోని విభిన్న అంశాలను ప్రభావితం చేస్తుందని నమ్మకం ఉంది. వాటిలో బుధుడు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నాడు. ఈ గ్రహం మన ఆలోచనా విధానం, సంభాషణ, వ్యాపారం, విద్య, నిర్ణయం తీసుకునే తీరును ప్రభావితం చేస్తుంది. బుధుడు ఒక రాశి నుండి మరొక రాశికి ప్రవేశించినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశుల మీద కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
ఈసారి అక్టోబర్ 3, 2025న బుధుడు తులా రాశిలోకి అడుగుపెడుతున్నాడు. తులా రాశి స్వభావం దౌత్యం, సమతుల్యత, భాగస్వామ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బుధుడు ఈ రాశిలోకి ప్రవేశించడంతో సంబంధాలు, విద్య, కెరీర్, ఆర్థిక రంగాల్లో ప్రత్యేకమైన మార్పులు చోటుచేసుకుంటాయి.
మేష రాశి..
మేష రాశి వారికి ఈ సంచారం ఏడవ ఇంట్లో జరుగుతుంది. ఇది ప్రధానంగా వివాహం, భాగస్వామ్యం, వ్యాపార సంబంధాలపై దృష్టి పెడుతుంది. జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో పరస్పర అర్థం చేసుకోవడం మెరుగుపడుతుంది. సంభాషణలో స్పష్టత రావడంతో సమస్యలు సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త మార్పులు అనుభవిస్తారు.
వృషభ రాశి..
వృషభ రాశి వారికీ బుధుడు ఆరవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ ఇల్లు ఆరోగ్యం, సేవా రంగం, పోటీకి సంబంధించినది. కాబట్టి ఈ కాలంలో వృషభ రాశివారు పనిలో సవాళ్లను ఎదుర్కొంటారు. కానీ తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలను అధిగమించగలరు. ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉండటం వల్ల ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మిథున రాశి..
మిథున రాశి వారికి ఈ సంచారం ఐదవ ఇంట్లో జరుగుతుంది. ఈ ఇల్లు సృజనాత్మకత, ప్రేమ, విద్యను సూచిస్తుంది. విద్యార్థులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా నేర్చుకోవడానికి మంచి అవకాశాలు దొరుకుతాయి. అలాగే కళాత్మక రంగంలో ఉన్న వారికి ఈ కాలం లాభదాయకం. పదకొండవ ఇంటిపై ప్రభావం కారణంగా ఆర్థిక లాభాలు, కొత్త పరిచయాలు సాధ్యమవుతాయి.
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి బుధుడు నాల్గవ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఇది కుటుంబం, ఆస్తి, గృహ సౌఖ్యం వంటి అంశాలను సూచిస్తుంది. ఈ సమయంలో గృహ జీవితంలో శాంతి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, ఆస్తి సంబంధిత నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. పదవింటిపై బుధుడి ప్రభావం కెరీర్‌లో మంచి అవకాశాలు తెస్తుంది.
సింహ రాశి…
సింహ రాశి జాతకంలో బుధుడు మూడవ ఇంట్లోకి వెళ్తాడు. ఇది ధైర్యం, కమ్యూనికేషన్, తోబుట్టువుల సంబంధాలను బలోపేతం చేస్తుంది. తొమ్మిదవ ఇంటి ప్రభావం కారణంగా విద్య, ఆధ్యాత్మికత, అదృష్టం పట్ల కొత్త దారులు తెరుచుకుంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది ఉత్తమ సమయం.
కన్య రాశి..
కన్య రాశి వారికీ బుధుడు రెండవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ ఇల్లు కుటుంబం, సంపద, మాటతీరు వంటి అంశాలకు సంబంధించినది. ఈ సమయంలో ఆర్థిక ప్రణాళిక మెరుగుపడుతుంది. మాటతీరు ద్వారా ఇతరులపై మంచి ప్రభావం చూపగలరు. ఎనిమిదవ ఇంటిపై బుధుడు ప్రభావం కారణంగా ఉమ్మడి పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం.
తులా రాశి ..
తులా రాశి వారికి బుధుడు స్వస్థానంలో మొదటి ఇంట్లో ఉంటాడు. ఈ ఇల్లు వ్యక్తిత్వం, ఆకర్షణ, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. కనుక ఈ కాలంలో వీరి వ్యక్తీకరణ, ఆకర్షణీయత పెరుగుతుంది. ఏడవ ఇంటిపై ప్రభావం కారణంగా వివాహం, భాగస్వామ్యాలలో బలపడే పరిస్థితులు వస్తాయి. స్వీయ అభివృద్ధి కోసం ఇది శ్రేష్ఠమైన సమయం.
వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారికి బుధుడు పన్నెండవ ఇంట్లో ఉంటుంది. ఇది ఆధ్యాత్మికత, ఖర్చులు, విదేశీ సంబంధాలను సూచిస్తుంది. అలాగే ఆరవ ఇంటిపై ప్రభావం కారణంగా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుంది. వివాదాలను తెలివిగా ముగించగలరు. అంతేకాక ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇది ఉపకరిస్తుంది.
ధనుస్సు రాశి…
ధనుస్సు రాశి జాతకంలో బుధుడు పదకొండవ ఇంట్లో ఉంటాడు. ఇది ఆదాయం, ఆశలు నెరవేర్చుకోవడం, లాభాలను సూచిస్తుంది. ఈ కాలంలో స్నేహితులు, పరిచయాలు వలన ప్రయోజనాలు వస్తాయి. ఐదవ ఇంటిపై ప్రభావం వల్ల ప్రేమ, సృజనాత్మకత, విద్యలో మంచి మార్పులు జరుగుతాయి.
మకర రాశి..
మకర రాశి వారికి ఈ సంచారం పదవింట్లో జరుగుతుంది. ఇది కెరీర్, పేరు ప్రతిష్ఠ, నాయకత్వం వంటి అంశాలను బలపరుస్తుంది. నాల్గవ ఇంటిపై ప్రభావం కారణంగా గృహ జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఉద్యోగం, కుటుంబ జీవితం మధ్య సమతుల్యత సాధించగలరు.
కుంభ రాశి..
కుంభ రాశి వారికి బుధుడు తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తాడు. ఇది ఉన్నత విద్య, ప్రయాణం, ఆధ్యాత్మికతకు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో చదువు, ప్రయాణాలకు మంచి అవకాశాలు వస్తాయి. మూడవ ఇంటిపై ప్రభావం వల్ల కమ్యూనికేషన్, తోబుట్టువుల సంబంధాలు బలపడతాయి.
మీన రాశి..
మీన రాశి వారికి బుధుడు ఎనిమిదవ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఇది పరివర్తన, వారసత్వం, ఆకస్మిక మార్పులను సూచిస్తుంది. రెండవ ఇంటిపై ప్రభావం కారణంగా కుటుంబం, మాటతీరు, ఆర్థిక విషయాల్లో మెరుగుదల ఉంటుంది. స్పష్టమైన కమ్యూనికేషన్ వలన సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు.


