Mercury Transit into Scorpio: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాలు యువరాజు, ఫ్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇతడు రేపు అంటే అక్టోబర్ 24న వృశ్చికరాశిలో సంచరించబోతున్నాడు. అతడు అదే రాశిలో నవంబర్ 23 వరకు ఉంటాడు. పైగా వృశ్చిక రాశి బుధుడికి అనుకూలం కూడా కాదు. మెర్క్యూరీ సంచారం వల్ల మేషం, మిథునం, వృశ్చికం, కన్య, ధనస్సు రాశులవారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వారికి ఎలాంటి కష్టాలు రానున్నాయో తెలుసుకుందాం.
వృశ్చికం
ఇదే రాశిలో బుధుడు సంచారం జరగబోతుంది. దీంతో ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోతారు. కెరీర్ లో పురోగతి ఉండదు. ఆస్తి వ్యవహారాల్లో మోసపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కలిసిరావు. బంధుమిత్రులు మోసం చేసే అవకాశం ఉంది. డబ్బు సమస్యలు వస్తాయి. ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు.
ధనుస్సు
మెర్క్యూరీ మార్పు ధనస్సు రాశి వారికి అస్సలు కలిసిరాదు. అధికారులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతారు. దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. మీ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోవచ్చు. ఇష్టం లేని చోటుకి బదిలీ అయ్యే అవకాశం ఉంది. పెళ్లి కోసం మరికొంత కాలం ఆగాలి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు.
మేష రాశి
బుధుడు యెుక్క సంచారం వల్ల మేష రాశి వారు ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. పిల్లల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. బంధువులతో గొడవలు వస్తాయి.
Also Read: Karthika Masam 2025 – కార్తీక మాసంలో అదృష్టం వరించబోయే రాశులు ఏవో తెలుసా?
మిథునం
వృశ్చిక రాశిలో బుధుడు సంచారం మిథునరాశి వారికి అననుకూల ఫలితాలను ఇస్తుంది. ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాల్లో భారీగా నష్టాలను చవిచూస్తారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అప్పుల ఊబిలో చిక్కుకుపోతారు. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు సరైన రిజల్ట్స్ ఇవ్వవు. వైవాహిక జీవితంలో వివాదాలు వస్తాయి. జాబ్ కోసం మ రికొంత కాలం వేచిచూడాల్సి రావచ్చు.
కన్య
కన్యా రాశి వారి సంపద పెరగకపోవచ్చు. ప్రయాణాలు అనుకూలించవు. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగిరాకపోవడంతో మీరు ఇబ్బంది పడతారు. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ కాకపోవచ్చు. వ్యాపారం మందగించే అవకాశం ఉంది. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కెరీర్ లో అడ్డంకులు ఏర్పడతాయి.


