Thursday, January 15, 2026
HomeదైవంSpiritual: కన్యారాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

Spiritual: కన్యారాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

Mercury transit 2025: గ్రహాల సంచారం మనిషి జీవన శైలిపై, ఆర్థిక స్థితిపై, సంబంధాలపై, వృత్తి ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా బుధుడు తెలివితేటలు, ఆర్థిక ప్రగతి, వ్యాపారం, మాటతీరు, ఆలోచన శక్తిని సూచించే గ్రహంగా పండితులు పరిగణిస్తారు. ఒకరి జాతకంలో బుధుడు బలంగా ఉన్నప్పుడు స్పష్టమైన ఆలోచన, సరైన నిర్ణయాలు, ఆర్థిక సౌకర్యం కలుగుతాయి. కానీ బలహీనంగా ఉన్నప్పుడు గందరగోళం, మాటల్లో తడబాటు, ఆర్థిక సమస్యలు వంటివి ఎదురవుతాయి.

- Advertisement -

ఇక బుధుడు తన సంచారాన్ని మార్చబోతున్న సమయం వచ్చినట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 2025 సెప్టెంబర్ 15న ఉదయం 10:58 గంటలకు బుధుడు కన్యరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ మార్పు కేవలం వ్యక్తులకే కాకుండా దేశం, ఆర్థిక రంగం, వ్యాపారాలపై కూడా ప్రభావం చూపనుందని జ్యోతిష్యులలు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ మార్పు అనూహ్యమైన ఫలితాలను ఇవ్వనుంది.

Also Read:https://teluguprabha.net/news/vastu-rules-for-west-direction-and-shani-effects/

వృషభ రాశి

వృషభ రాశివారికి బుధుని ఈ సంచారం శుభప్రదంగా మారనుంది. వృత్తిలో ఉన్నవారు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి విస్తరణకు దారితీసే అవకాశాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టినప్పుడు మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా బలపడటంతో పాటు కొత్త ప్రాజెక్టులపై నమ్మకంగా ముందుకు వెళ్తారు. ఈ సమయంలో పట్టుదలతో కృషి చేస్తే, ఫలితాలు తప్పక సానుకూలంగా మారతాయి.

మిథున రాశి

మిథున రాశివారికి ఈ బుధ సంచారం ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెస్తుంది. మీరు చేసిన కృషి ఫలితంగా డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో పెట్టుబడులు మంచి లాభాలను తెస్తాయి. కొత్త పనులు ప్రారంభించాలనే ఆలోచనలు సాకారమవుతాయి. ఆదాయాన్ని పెంచుకోవడమే కాకుండా దాచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు, ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. మొత్తం మీద ఈ కాలం వారికి సంతృప్తి మరియు ఆనందాన్ని ఇస్తుంది.

సింహ రాశి

సింహ రాశివారికి ఈ సంచారం బలమైన ఆర్థిక లాభాలను అందిస్తుంది. పెట్టుబడుల ద్వారా మంచి ఆదాయం వస్తుంది. వృత్తి పరంగా కొత్త అవకాశాలు లభించి, మీరు చేసే పనులు గుర్తింపు పొందుతాయి. వ్యాపారంలో తెలివిగా తీసుకునే నిర్ణయాలు గొప్ప రాబడిని ఇస్తాయి. డబ్బు ఆదా చేసే అలవాటు కూడా పెరుగుతుంది. కుటుంబంలో సౌఖ్యం నెలకొంటుంది. ఈ సమయంలో ధైర్యంగా ముందుకు సాగితే పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంటుంది.

కన్య రాశి

కన్య రాశివారికి బుధుడు స్వగ్రహంలోకి రావడం వల్ల ప్రత్యేక శుభఫలాలు కలుగుతాయి. పనుల్లో వేగం పెరుగుతుంది. మీరు చేసే కృషి ఫలితంగా లక్ష్యాలు చేరువవుతాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు కానీ ఆ ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి. వృత్తి మరియు వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ప్రారంభించే పనులు విజయవంతమవుతాయి. ఈ కాలంలో ధైర్యం, నిర్ణయశక్తి పెరగడంతో కొత్త విజయాలు సాధించే అవకాశం ఉంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/importance-of-krishna-kamalam-plant-in-vastu-and-spiritual-benefits/

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారికి ఈ బుధ సంచారం సానుకూలతను తెస్తుంది. స్నేహితులు, బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా లాభాలు కలగవచ్చు. వృత్తి రంగంలో మీరు చేసే కృషి గుర్తింపు పొందుతుంది. విదేశీ సంబంధిత పనులు చేపట్టిన వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. కొత్త అవకాశాలు లభించి, కెరీర్‌లో ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాలం వారి జీవితంలో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపుతుంది.

మకర రాశి

మకర రాశివారికి బుధుని ఈ సంచారం కొత్త అవకాశాలను తెస్తుంది. మీరు చేసే కృషి ఫలిస్తుందనే బలమైన సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా లాభదాయకమైన పరిస్థితులు ఎదురవుతాయి. అప్పులు తీర్చుకోవడానికి ఇది సరైన సమయం. వ్యాపారంలో పెట్టుబడులు ఫలప్రదంగా మారతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభను చూపించడానికి అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మీరు పొందే విజయాలు భవిష్యత్తులో మరింత బలంగా నిలబడేలా చేస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News