Sunday, July 13, 2025
HomeదైవంBudh Gochar: పుష్యమి నక్షత్రంలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు..

Budh Gochar: పుష్యమి నక్షత్రంలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు..

Mercury in Pushya Nakshatra 2025: జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు, ఫ్లానెట్స్ ప్రిన్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఈ గ్రహాన్ని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇటీవల గ్రహాల రాకుమారుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ మార్పు 12 రాశిచక్రాల వారిపై పెను ప్రభావాన్ని చూపనుంది. దీని కారణంగా కొందరి ఆర్థిక స్థితిగతులు మారిపోనున్నాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

- Advertisement -

కన్యా రాశి
బుధుడి నక్షత్ర సంచారం కన్యారాశి వారి దారిద్ర్యాన్ని పోగొట్టి ధనవంతులు చేస్తుంది. హెల్త్ బాగుంటుంది. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోయి మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. ఈ టైంలో పెట్టే పెట్టుబడులు మీకు ఎప్పుడు ఇవ్వని లాభాలను ఇస్తాయి. మీ డ్రీమ్స్ నెరవేరుతాయి. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి.. మంచి పొజిషన్ కు వెళతారు. మీ తలరాత మారుతుంది. వివాహం కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

వృషభరాశి
బుధుడు నక్షత్రరాశి మార్పు కారణంగా వృషభరాశి వారిని అదృష్టం వరించనుంది. వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. అన్ని సమస్యలు నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కాలం కలిసివచ్చి జాబ్ సంపాదిస్తారు. వ్యాపారాలు రెట్టింపు లాభాలను ఇస్తాయి. మీ జీవితంలో ఆనందం తాండవిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి రానే వస్తుంది. శాలరీ అమాంతం పెరిగిపోతుంది. సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.

మకర రాశి
మకరరాశి వారికి బుధుడి పుష్యమి నక్షత్ర సంచారం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు కెరీర్ లో చాలా విజయాలు సాధిస్తారు. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. మీకు మంచి జీవితభాగస్వామి దొరికే అవకాశం ఉంది. మీ ఆర్థిక స్థితిగతులన్నీ మారిపోతాయి. విద్యార్థులు, పోటీపరీక్షలకు ప్రిపేర్త అయ్యే అభ్యర్థులకు ఈ సమయం బాగుంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి.

తులారాశి
తులారాశి వారికి మెర్క్యూరీ నక్షత్ర మార్పు విపరీతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ లక్ష్యానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దేవుడి దయ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉంటారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్నది సాధిస్తారు. మీకు లక్ కలిసి వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News