Budh Gochar in December 2025: జ్యోతిష్యశాస్త్రంలో బుధ గ్రహాన్ని ప్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. ఇతడు కాలానుగుణంగా తన రాశి లేదా నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాడు. మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే డిసెంబరు నెలలో ఎన్నడూ లేని విధంగా ఐదు సార్లు తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. వచ్చే నెల 06న వృశ్చిక రాశిలోకి, 10న విశాఖ నక్షత్రాన్ని విడిచిపెట్టి అనురాధ నక్షత్రంలోకి, 20న జ్యేష్ఠ నక్షత్రంలోకి, 29న ధనస్సు రాశితోపాటు మూల నక్షత్రంలోనూ సంచరించబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు జాక్ పాట్ కొట్టనున్నారు.
సింహరాశి
బుధుడి స్థానంలో మార్పులు సింహరాశి వారికి ఊహించని బెనిఫిట్స్ ను అందించబోతుంది. మీ తెలివితేటలతోపాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి. వ్యాపారంలో విజయావకాశాలు ఉంటాయి. బెట్టింగ్, ట్రేడింగ్ వంటి కార్యకలాపాలు ద్వారా చాలా డబ్బును కూడబెడతారు. భార్యభర్తల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ఇతరులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుతారు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
మకర రాశి
బుధుడు గోచారం మకర రాశి వారికి కలిసి రానుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఉంటాయి. కెరీర్ దూసుకుపోతుంది. మీ చిరకాల స్వప్నం నెరవేరుతోంది. విద్య లేదా పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ పనికి సీనియర్స్ తోపాటు బాస్ నుండి ప్రశంసలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్, బెట్టింగ్ లేదా స్టాక్ మార్కెట్ రంగాల్లో ఉన్నవారు భారీ లాభాలను గడిస్తారు. మీ జీవితంలో ఆనందంతోపాటు డబ్బు ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతిని సాధిస్తారు.
Also Read: Saturn transit – 30 ఏళ్ల తర్వాత శని, బుధుల అద్భుతం
తులా రాశి
డిసెంబర్ నెల తులారాశి వారి తలరాతను మార్చబోతుంది. మీ జీవితంలో ఎన్నడూ చూడని మార్పులను చూస్తారు. చిన్న వ్యాపారంతో మెుదలైన మీ జర్నీని మరింత విస్తరిస్తారు. మీ ఆదాయం ఓ రేంజ్ లో వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదుగుతారు. భార్యపిల్లలతో మంచి సమయం గడుపుతారు. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ప్రతి పనిలో లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సక్సెస్ అవుతారు.
Disclaimer: పైన ఇచ్చిన కథనం నిజమని మేము ఖచ్చితంగా చెప్పలేం. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను రూపొందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.

