Raksha Bandhan 2025 Effect On Zodiacs: సోదరసోదరీమణుల అనుబంధానికి గుర్తుగా రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ ఆగస్టు 09న వచ్చింది. పైగా ఇదే రోజు గ్రహాల యువరాజైన బుధుడు ఉదయించబోతున్నాడు. విద్య, తెలివితేటలు మరియు వ్యాపారానికి సూచికగా భావించే బుధుడు గమనంలోని మార్పు కొందరికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. ఆగస్టు 09 నుంచి వీరు ముట్టిందల్లా బంగారం అవుతోంది. ధన ధాన్యాలకు లోటు ఉండదు. నిత్య ఆరోగ్యంతో ఉంటారు. లైఫ్ హాయిగా గడిచిపోతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో తెలుసా?
మేష రాశి
రాఖీ పౌర్ణమి మేషరాశి వారికి లక్ తోపాటు డబ్బును కూడా తీసుకురాబోతుంది. వీరి బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతుంది. భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వ్యక్తులు విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో అనుకోని లాభాలు ఉంటాయి. కెరీర్ లో ఆపారమైన ఎదుగుదల ఉంటుంది. జాబ్ లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది. పనిలో మీ బాస్ నుండి ప్రశంసలు అందుకుంటారు.
కన్యా రాశి
రాఖీ పౌర్ణమి నాడు బుధుడు పెరుగుదల కన్యారాశి వారికి ఆకస్మిక ధనలాభాలను ఇస్తుంది. వీరు కెరీర్ కు సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. మీరు లవ్ లో సక్సెస్ అవుతారు. వివాహా యోగం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ప్రయోజనాలను పొందుతారు. సంపద వృద్ధి చెందుతుంది. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహా జీవితం బాగుంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో ఉన్నతాధికారుల మద్దతు మీకు లభిస్తుంది.
Also Read: vastu tips for home – ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి.. లేకపోతే మీ బతుకు బస్టాండే!
మిథునరాశి
బుధుడు ఉదయించడం వల్ల మిథున రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరనున్నాయి. వీరు ఆదాయం ఎన్నో రెట్లు పెరుగుతుంది. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. పెళ్లికాని వ్యక్తులకు వివాహం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. రాఖీ పండుగ సమయంలో పెట్టే పెట్టుబడులు భారీగా లాభాలను ఇస్తాయి. మీ కృషికి తగిన ప్రయోజనం పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు భారీగా పెరుగుతాయి. వ్యాపారులు, ఉద్యోగులు లాభపడతారు. కెరీర్ లో ఊహించని గ్రోత్ ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా సాగిపోతుంది.
Also Read: Janmashtami 2025- ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగష్టు 15నా లేదా 16నా? ఖచ్చితమైన తేదీ తెలుసుకోండి..


