Mercury Transit 2025 in Scorpio: జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాలు యువరాజుగా పరిగణిస్తారు. ఇతడిని తెలివితేటలు, కమ్యూనికేషన్స్ స్కిల్స్ కు కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం బుధుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. దీపావళి తర్వాత మెర్క్యూరీ తులా రాశిని విడిచిపెట్టి వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు అక్టోబర్ 24, మధ్యాహ్నం 12:39 గంటలకు జరగబోతుంది. వృశ్చిక రాశికి అధిపతిగా కుజుడుని భావిస్తారు. అంగారకుడి రాశిలో బుధుడు సంచారం వల్ల మూడు రాశులవారు నక్కతోక తొక్కబోతున్నారు. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. ఆ అదృష్ట రాశులు ఏవో ఓ లుక్కేద్దాం.
వృశ్చిక రాశి
దీపావళి తర్వాత ఇదే రాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. దీంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ తెలివితేటలతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. కెరీర్ కు సంబంధించి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ మాటలతో నలుగురిని ఆకట్టుకుంటారు. అదృష్టంతోపాటు ఐశ్వర్యం కూడా ఉంటుంది. అప్పుల ఊబి నుండి బయటపడతారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
మేషరాశి
బుధుడు రాశి మార్పు మేష రాశికి చెందిన వ్యక్తుల అదృష్టాన్ని మార్చబోతుంది. కోరుకున్న వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. జాబ్ కు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు భారీగా లాభాలను ఇస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించవచ్చు. బీమా, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ మెంట్ చేసే వారికి ఊహించని లాభాలు ఉంటాయి. సంసార జీవితం సాఫీగా సాగుతోంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. లక్ కలిసి వస్తుంది.
మిథున రాశి
మిథున రాశికి బుధుడు సంచారం అద్భుత ఫలితాలను ఇస్తుంది. మీరు వేసిన ఫ్లాన్స్ ఫలిస్తాయి. గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బు ఇప్పుడు తిరిగి వస్తుంది. విదేశీ వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారు విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి. మీ ఆలోచనలే మీ పెట్టుబడి. వ్యాపారం విస్తరిస్తుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
Also Read: Surya Gochar 2025 – తులా రాశిలో సూర్య, బుధుల కలయిక..ఈ 5 రాశులకు తిరుగులేదు ఇక..
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మతపరమైన కార్యక్రమాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కథనాన్ని పండితుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


