సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని రాష్ట్ర హెచ్ఆర్డీ, ఐటి ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్, ఆర్టిజిస్ శాఖా మంత్రి నారా లోకేష్(Lokesh) దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి 12 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ లకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

కడప విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, కడప డిఎస్పీ వెంకటేశ్వర్లు, నేతలు భూపేష్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, హరి ప్రసాద్, ఇతర అధికారులు, తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి వారికి ఘన స్వాగతం పలికారు.


కాగా.. విమానాశ్రయం లాంజ్ లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, సత్యప్రసాద్ లు అందరినీ ఆప్యాయంగా పలకరించిన అనంతరం విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో అధికారులు, నేతలు, ప్రముఖులు తదితరులు మంత్రులకు ఘన వీడ్కోలు పలికారు.