Moles on Body Parts: జ్యోతిష్యంలో సాముద్రిక శాస్త్రం కూడా ఒక భాగమనే చెప్పాలి. దీని గురించి హిందూ గ్రంథాల్లో కూడా చెప్పబడింది. మనిషి యెుక్క అవయవాలను బట్టి అతడు లేదా ఆమె ప్యూచర్ ను చెప్పవచ్చు. మీ శరీరం మీద ఉండే మీ పుట్టుమచ్చలను బట్టి మీ భవిష్యత్తును అంచనా వేయవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం, మీ బాడీ మీద ఐదు ప్రదేశాల్లో ఉండే పుట్టుమచ్చలు మిమ్మల్ని అదృష్టవంతులను చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
**సాముద్రిక శాస్త్రం ప్రకారం, అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులనే చెప్పాలి. మీకు అపారమైన సంపదను, కెరీర్ లో విజయాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మగవారి కుడి అరచేతిలో బొటనవేలు కింద లేదా మధ్య భాగంలో పుట్టు మచ్చ ఉంటే.. అతడి జీవితంలో సంపద, శ్రేయస్సు, విజయం ఉంటాయి. అంతేకాకుండా ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతారు.
**అరికాళ్ళపై పుట్టుమచ్చలు ఉండటం శుభప్రదమని భావిస్తారు. వీరికి లక్ కలిసి వచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు విదేశాలకు వెళ్లే యోగం ఉంది.
**నుదిటిపై పుట్టుమచ్చ ఉన్నవారికి లీడర్ షిప్ క్వాలిటీస్ మెండుగా ఉంటాయి. అలాంటి వ్యక్తులు సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. పాలిటిక్స్ లో ఉన్నవారు సక్సెస్ అవుతారు.
**మెడ మీద పుట్టుమచ్చ ఉంటే పుడ్ కు లోటు ఉండదు. అంతేకాకుండా బట్టలు, డబ్బుకు కూడా కొరత ఉండదని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఈ వ్యక్తులు చాలా మృదు స్వభావులు. వీరు ఏ పని చేసినా ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. మెడపై పుట్టుమచ్చ ఉన్నవారిని అందరూ ఇష్టపడతారు.
**నాభి దగ్గర పుట్టుమచ్చ ఉండటం అదృష్టమనే చెప్పాలి. ఇది సంతానప్రాప్తికి సూచిక. అంతేకాకుండా వీరు ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉంటారు. భౌతిక సుఖాలను పొందుతారు. జీవితంలో ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడతారు. వీరు ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడుపుతారు.
Also Read: Raksha Bandhan 2025- రాఖీ పండుగ నాడు ఉపవాసం ఉండాలా?


