Moon Transit after Diwali 2025: దీపావళి తర్వాత చంద్రుడు గమనంలో పెను మార్పులు రాబోతున్నాయి. అక్టోబర్ 23 నుండి 25 వరకు వృశ్చిక రాశిలోనూ, 26 నుండి 28 వరకు ధనూ రాశిలోనూ చంద్రుడు సంచారం చేయనున్నాడు. ధనూ రాశిలో చంద్రుడు సంచారం చేస్తున్న సమయంలోనే కర్కాటక రాశిలో గురుడు గోచారం జరుగుతుంది. దీని కారణంగా అరుదైన పరివర్తన యోగం ఏర్పడబోతుంది. ఇది కొన్ని రాశులవారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
కర్కాటకం
పరివర్తన యోగంతో కర్కాటక రాశి వారి అదృష్టం మారిపోనుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అవుతుంది. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. వ్యాపారం లాభాలపథంలో దూసుకుపోతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది.
తుల
చంద్రుడు, గురు దృష్టి వల్ల తులరాశి వారి ఫేట్ మారబోతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగులకు విదేశీ యోగం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. మీ రాబడి విపరీతంగా పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
మీనరాశి
దీపావళి తర్వాత శుభకరమైన యోగం మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు అపారమైన సంపద కలుగుతుంది. ఆస్తిపరంగా, ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలకు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
మేషం
మేష రాశి వారికి పరివర్తన యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ మరియు పెళ్లికి సంబంధించిన శుభవార్త వింటారు. జాబ్ చేసేవారి జీతభత్యాలు పెరుగుతాయి. ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. మీరు వేసుకున్న ప్రణాళికాలన్నీ ఫలమిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఏదైనా ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Rajyoga 2025-దీపావళి నాడు జాక్ పాట్ కొట్టబోతున్న 4 రాశులు ఇవే.. మీది ఉందా?
వృషభం
చంద్రుడు, గురుడు చేస్తున్న పరివర్తన యోగం వల్ల వృషభరాశి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. మీరు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ కెరీర్ అద్బుతంగా ఉంటుంది.
మిథునం
మరో ఆరు రోజుల్లో ఏర్పడబోయే పరివర్తన యోగం వల్ల వీరి సంపద భారీగా వృద్ధి చెందనుంది. ఉద్యోగంలో బాధ్యతలతోపాటు జీతం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది.


